te_tw/bible/other/province.md

2.9 KiB

ప్రాంతము, ప్రాంతములు, ప్రాంతీయ

వాస్తవాలు:

ప్రాంతము అనగా ఒక సామ్రాజ్యము లేక ఒక దేశము యొక్క భాగమైయుండును లేదా ఆ దేశపు ప్రాంతమైయుండును. “ప్రాంతీయ” అనే ఈ పదము ఒక ప్రాంతమునాకు సంబంధించిన దానిని వివరించును, ఉదాహరణకు, ప్రాంతీయ పాలకుడు.

  • ఉదాహరణకు, పురాతన పారసీక రాజ్యము మాదీయ, పారసీక, సిరియా మరియు ఐగుప్తు ప్రాంతాలుగా విభజించబడెను.
  • క్రొత్త నిబంధన కాలములో రోమా సామ్రాజ్యము మాసిదొనియ, ఆసియా, సిరియా, యుదాయ, సమరయ, గలీలయ మరియు గలతీయ ప్రాంతాలుగా విభజించబడెను.
  • ప్రతీ ప్రాంతములో తమ స్వంత పాలనను కలిగియుంటారు, వారు రాజుకుగాని లేక సామ్రాజ్య పాలకునిగాని లోబడియుండవలసియుంటుంది. ఈ పాలనను కొన్నిమార్లు “ప్రాంతీయ అధికారము” లేక “ప్రాంతీయ పాలన” అని కూడా పిలుస్తారు.
  • “ప్రాంతము” మరియు “ప్రాంతీయ” అనే ఈ రెండు పదాలను “ప్రదేశము” మరియు “ప్రాదేశిక” అని కూడా తర్జుమా చేస్తారు.

(ఈ పదములను కూడా చూడండి: ఆసియా, ఐగుప్తు, ఎస్తేరు, గలతీ, గలీలియా, యుదాయ, మాసిదొనియా, మాదీయ, రోమా, సమరయ, సిరియా)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H4082, H4083, H5675, H5676, G1885