te_tw/bible/other/fruit.md

8.2 KiB
Raw Permalink Blame History

ఫలం, ఫలవంతం, నిష్ఫలమైన

నిర్వచనం:

"ఫలం" అక్షరాలా మనం తినగలిగే చెట్టు భాగాన్ని సూచిస్తున్నది. "ఫలభరితం" గా ఉన్నదానికి అనేక ఫలాలు ఉంటాయి. ఈ పదాలు బైబిలులో అలంకారికంగా ఉపయోగించబడ్డాయి.

  • బైబిలు తరచుగా "ఫలం" అనే పదాన్ని ఒక వ్యక్తి క్రియలను సూచిస్తూ ఉపయోగిస్తుంది. చెట్టుకు కాసిన పండు ఆ చెట్టు ఎటువంటిదో చూపించినట్టుగానే ఒక వ్యక్తి మాటలు, క్రియలు తన గుణ లక్షణాలను వెల్లడిస్తాయి.
  • ఒక వ్యక్తి మంచి, లేక చెడ్డ ఆత్మ సంబంధమైన ఫలాలను కలుగచేస్తాడు. అయితే "ఫలభరితం" అనే పదానికి ఎప్పుడూ అధికమైన మంచి ఫలాన్ని కలిగించడం అనే అర్థం ఉంటుంది.
  • "ఫలభరితం" అనే పదం అలంకారికంగా "సౌభాగ్య వంతమైనది" అని అర్థాన్ని ఇస్తుంది. అనేకమంది పిల్లలు, సంతానం, పుష్కలంగా ఆహారం, ఇతర సంపదలు కలిగి ఉన్న స్థితిని ఇది తరచుగా సూచిస్తున్నది.* సాధారణంగా "ఫలం" పదం దేనినుండైనా వచ్చిన దానిని సూచిస్తుంది. లేదా ఎవరైనా ఒకరు పండించిన దానిని సూచిస్తుంది. ఉదాహరణకు, "జ్ఞాన ఫలం" అంటే జ్ఞానం కలిగి ఉండడం నుండి కలిగే మంచి విషయాలను సూచిస్తున్నది.
  • "భూమి ఫలం" అనే వాక్యం సాధారణంగా ప్రజలు భుజించడానికి భూమి పండించే ప్రతీ దానినీ సూచిస్తుంది. దీనిలో ద్రాక్షలు లేదా ఖర్జూరాలు లాంటి ఫలాలు మాత్రమే కాదు అయితే కూరగాయలు, గింజలు, ధాన్యాలు కూడా ఉంటాయి.
  • "ఆత్మ ఫలం" అనే అలంకారిక వాక్యం దేవునికి విధేయత చూపే ప్రజల జీవితాలలో పరిశుద్ధాత్మ కలిగించే దైవిక లక్షణాలను సూచిస్తుంది.
  • "గర్భ ఫలం" అనే వాక్యం "గర్భము కలిగించేది" అంటే పిల్లలును సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

·         ఒక పండ్ల చెట్టునుండి తినదగిన పండును సూచించడానికి లక్ష్య భాషలో సాధారణంగా ఉపయోగించిన "ఫలం" పదం కోసం సాధారణ పదాన్ని వినియోగించి ఈ పదాన్ని అనువదించడం ఉత్తమం. *సందర్భాన్ని బట్టి "ఫలవంతం" పదం "అధికమైన ఆత్మీయ ఫలాలను కలిగిస్తుంది" లేదా "అనేకమైన పిల్లలను కలిగి యుండడం" లేదా "భాగ్యవంతమైన" అని అనువదించబడవచ్చు.

·         "భూఫలం" పదం "ఆ భూమి పండించే పంట.” లేదా “ఆ ప్రాంతంలో సాగు అయ్యే ఆహారం పంటలు" అని అనువదించబడవచ్చు.

·         దేవుడు జంతువులను మనుషులను సృష్టించినప్పుడు అయన వారికి ఇలా అజ్ఞాపించాడు- "మీరు ఫలించి, విస్తరించండి" అంటే అనేకమంది సంతానం కలిగియుండండి అని అర్థం. ఈ వాక్యం "అనేక మంది సంతానం కలిగియుండండి” లేదా “చాలా మంది పిల్లలు, సంతానం కలిగి యుండండి” లేదా “ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండండి, తద్వారా అధికమైన సంతానాన్ని కలిగియుంటారు" అని అనువదించబడవచ్చు.

·         "గర్భ ఫలం" అనే వాక్యం "గర్భము ఉత్పత్తి చేసేది" లేదా "స్త్రీలు కనే పిల్లలు" లేదా " కేవలం “పిల్లలు" అని అనువదించబడవచ్చు. ఎలీసెబెతు మరియతో "నీ గర్భఫలం ధన్యం" అని అనడంలో "నీవు కనబోయే పిల్లవాడు ధన్యుడు" అని అర్థం." లక్ష్య భాషలో దీనికి వివిధ పదాలు ఉండవచ్చు.

·         "ద్రాక్ష చెట్టు ఫలం," అనే మరొక వాక్యం "ద్రాక్ష చెట్టు పండు” లేదా “ద్రాక్షలు" అని అనువదించబడవచ్చు.

·         సందర్భాన్ని బట్టి, "మరింత ఫలభరితంగా ఉంటుంది " అనే వాక్యం "మరింత ఫలాన్ని ఇస్తుంది" లేదా "ఎక్కువ మంది పిల్లలు కలిగియుంటుంది" లేదా “మరింత భాగ్యవంతులు అవుతారు" అని అనువదించబడవచ్చు.

·         అపోస్తలుడు పౌలు చెప్పిన "ఫలభరిత సేవ" అనే వాక్యం "మంచి ఫలితాలు తెచ్చే పని" లేదా “అనేక మంది ప్రజలు యేసులో విశ్వాసం ఉంచేలా చేసే పని" అని అనువదించబడవచ్చు.

·         "ఆత్మ ఫలం" అనే పదం "పరిశుద్ధాత్మ కలిగించే కార్యం" లేదా “ఒకరిలో పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు అని చూపించే మాటలు, క్రియలు" అని అనువదించబడవచ్చు.

(చూడండి:descendant, grain, grape, Holy Spirit, vine, womb)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0004, H1061, H1063, H1069, H2233, H2981, H3581, H3759, H3899, H3978, H4022, H5108, H6509, H6529, H7019, H8393, H8570, G10810, G25900, G25920, G25930, G37030, G50520, G53520