te_tw/bible/kt/holyspirit.md

6.8 KiB
Raw Permalink Blame History

పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, ప్రభువు ఆత్మ, ఆత్మ

వాస్తవాలు:

ఈ పదాలన్నీ దేవుడైన పరిశుద్ధాత్మను సూచిస్తున్నాయి. ఒకే నిజ దేవుడు తండ్రి, కుమారుడు,, పరిశుద్ధాత్మడుగా నిత్యమూ ఉనికి కలిగియున్నాడు.

  • పరిశుద్ధాత్మ "ఆత్మ”గానూ, “యెహోవా ఆత్మ” గానూ “సత్య ఆత్మ” గానూ కూడా సూచించబడుతున్నాడు.
  • ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే. అయన తన స్వభావం అంతటిలోనూ, ఆయన చేస్తున్నదానంతటి లోనూ పరిపూర్ణంగా పరిశుద్ధుడు, అనంతమైన పవిత్రుడు, నైతికంగా పరిపూర్ణుడు.
  • తండ్రి, కుమారుడుతో పాటు పరిశుద్ధాత్మడు విశ్వాన్ని సృష్టించడంలో చురుకుగా పాల్గొన్నాడు.
  • దేవుని కుమారుడు యేసు పరలోకానికి తిరిగి వెళ్ళిన తరువాత దేవుడు పరిశుద్ధాత్మను తన ప్రజలను నడిపించడానికీ, వారికి బోధించడానికీ, ఆదరించడానికీ, దేవుని చిత్తం జరిగించేలా సిద్ధపరచడానికీ పంపించాడు.
  • పరిశుద్ధాత్మ యేసును నడిపించాడు, యేసులో విశ్వాసం ఉంచినవారిని ఆయన నడిపిస్తాడు.

అనువాదం సూచనలు:

  • ఈ పదం "పరిశుద్ధ” “ఆత్మ" పదాలను అనువదించడానికి ఉపయోగించే పదాలతో సరళంగా అనువదించబడవచ్చు.
  • ఈ పదం "శుద్ధ ఆత్మ” లేదా "పరిశుద్ధుడైన ఆత్మ" లేదా "దేవుడైన ఆత్మ" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

(చూడండి:holy, spirit, God, Lord, God the Father, Son of God, gift)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __1:1__అయితే దేవుని ఆత్మ నీటిమీద ఉన్నాడు.
  • 24:8

యేసు బాప్తిసం పొంది నీటిలోనుండి బయటకు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ పావురం ఆకారంలో ప్రత్యక్షం అయ్యాడు, ఆయనమీద వాలాడు.

సాతాను శోధనలు జయించిన తరువాత యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయ ప్ప్రాంరాంతానికి తిరిగి వెళ్లి అక్కడ నివసించాడు.

  • 26:3 యేసు చదివాడు, "దేవుడు తన ఆత్మను నాకు అనుగ్రహించాడు, పేదలకు సువార్త ప్రకటించడానికీ, ఖైదీలకు విడుదల ఇవ్వడానికీ, చూపులేనివారికి చూపు ఇవ్వడానికీ, అణగారిన వారికి విడుదల ఇవ్వడానికి ఆయనను పంపాడు.
  • 42:10"కాబట్టి మీరు వెళ్లి సమస్త మనుష్యులను శిష్యులుగా చెయ్యండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొన వలెనని బోధించడం ద్వారా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిసం ఇవ్వండి."
  • __43:3__వారతా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, వారు ఇతర భాషలలో మాట్లాడడం ఆరంభించారు.
  • 43:8"యేసు తాను వాగ్దానం చేసినట్టే పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు మీరు చూస్తూ వింటూ ఉన్నవాటిని పరిశుద్ధాత్మ జరిగిస్తున్నాడు."
  • 43:11 పేతురు వారికి ఇలా జవాబిచ్చాడు, "మీలో ప్రతి ఒక్కరూ దేవుడు మీ పాపాలు క్షమించేలా పశ్చాత్తాప పడి యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. తరువాత అయన మీకు పరిశుద్ధాత్మ అనే కానుకను అనుగ్రహిస్తాడు."
  • __45:1__అతడు (స్తెఫను) మంచి పేరుగలవాడు. పరిశుద్ధాత్మతో జ్ఞానంతో నిండిన వాడు.

పదం సమాచారం:

  • Strongs: H3068, H6944, H7307, G00400, G41510