te_tw/bible/other/grape.md

2.5 KiB
Raw Permalink Blame History

ద్రాక్ష, ద్రాక్షలు, ద్రాక్ష చెట్టు

నిర్వచనం:

ద్రాక్ష చిన్న, గుండ్రని, మృదు చర్మంతో ఉండే పండు. అది ద్రాక్ష చెట్టుకు గుత్తులుగా కాస్తుంది. ద్రాక్షల రసాన్ని ద్రాక్షారసం చెయ్యడానికి ఉపయోగిస్తారు.

  • ద్రాక్ష వివిధ రంగుల్లో ఉంటాయి. ఆకుపచ్చ, ఊదా రంగు, లేక ఎరుపు.
  • ద్రాక్షలు ఒకటి నుండి మూడు సెంటిమీటర్లు సైజులో ఉండవచ్చు. ద్రాక్షలను పెంచే క్షేత్రాలను ద్రాక్ష తోటలు అంటారు. వీటిల్లో సాధారణంగా ద్రాక్ష చెట్లు బారులు ఉంటాయి.
  • ద్రాక్షలు బైబిల్ కాలాల్లో చాలా ప్రాముఖ్యమైన ఆహారం. ద్రాక్ష తోటలు ఉండడం సంపద సూచన.
  • ద్రాక్షలను కుళ్ళిపోకుండా ఉంచడానికి తరచుగా వాటిని ఎండబెడతారు. ఎండబెట్టిన ద్రాక్షలను "ఎండు ద్రాక్షలు" అంటారు. వీటిని ముద్దలుగా వత్తి నిలవ చేస్తారు.
  • యేసు దేవుని రాజ్యం గురించి తన శిష్యులకు బోధించడానికి ద్రాక్ష తోట ఉదాహరణ వాడాడు.

(చూడండి: ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తోట, ద్రాక్షారసం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0811, H0891, H1154, H1155, H1210, H3196, H5955, H6025, H6528, G02880, G47180