te_tw/bible/other/wine.md

4.6 KiB

ద్రాక్షారసం, ద్రాక్షారసం తిత్తి, క్రొత్త ద్రాక్షారసం

నిర్వచనం:

పరిశుద్ధ గ్రంథములో “ద్రాక్షారసం” పదం ద్రాక్షలు అనే పండ్ల రసముతో బాగుగా పులియబెట్టి చేసి తీసిన ఒక విధమైన పానీయమును సూచిస్తుంది. ద్రాక్షారసమును “ద్రాక్షారస తిత్తు"లలో” భద్రము చేసి ఉంచుతారు, ఈ తిత్తులను ప్రాణుల చర్మాలతో తయారుచేస్తారు.

  • “క్రొత్త ద్రాక్షారసం” పదం పులియబెట్టకుండ ద్రాక్షలనుండి అప్పటికప్పుడే తీసిన ద్రాక్షారసమును సూచిస్తుంది. కొన్నిసార్లు “ద్రాక్షారసం” కూడా పులియబెట్టని ద్రాక్షారసమును సూచిస్తుంది.
  • ద్రాక్షారసమును చేయడానికి, ద్రాక్ష పళ్ళను మద్యపు తొట్టిలో వేసి త్రొక్కుతారు, ఆ రసము చివరికి పులిసి, దానిలో మద్యపానం ఏర్పడుతుంది.
  • బైబిలు కాలములలో ద్రాక్షారసం భోజముతోపాటు తీసికునే సహజమైన పానీయం. నేటి మద్యపానమువలె ఆ రోజులలో ద్రాక్షారసం ఉండేది కాదు.
  • భోజనము కోసం ద్రాక్షారసం వడ్డించడానికి ముందు తరచుగా ద్రాక్షారసమును నీళ్ళతో కలిపేవారు.
  • పాతగిలిన మరియు పెళుసుగా ఉన్నటువంటి ద్రాక్షా తిత్తులు పిగిలిపోతాయి, తద్వారా అందులోని ద్రాక్షారసం బయటకి కారుతుంది. క్రొత్త ద్రాక్షాతిత్తులు చాలా మృదువుగానూ, అనువైనవిగానూ ఉంటాయి, అంటే అవి అంత సులభముగా చినిగిపోవు మరియు ద్రాక్షారసమును భద్రముగా ఉంచుతాయి.
  • మీ సంస్కృతిలో ద్రాక్షరసమునుగూర్చి తెలియకపొతే, ఇది “పులియబెట్టిన రసము” లేదా “ద్రాక్ష పండ్ల నుండి తీసి పులియబెట్టిన పానీయం” లేదా “పులియబెట్టిన ద్రాక్షారసం” అని అనువదించబడ వచ్చు. (చూడండి: తెలియనివాటిని ఏవిధంగా అనువదించాలి)
  • “ద్రాక్షారసపు తిత్తి” పదం “ద్రాక్షారసం కొరకు సంచి” లేదా "ద్రాక్షారసం కోసం జంతు చర్మపు సంచి" అని ఇతర విధాలుగా అనువదించవచ్చు.

(చూడండి: ద్రాక్ష, ద్రాక్షారసం, ద్రాక్షతోట, ద్రాక్ష గానుగ)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2561, H2562, H3196, H4469, H4997, H5435, H6025, H6071, H8492, G1098, G3631, G3820, G3943