te_tw/bible/other/winepress.md

2.6 KiB

ద్రాక్షరసపు గానుగ (లేక తొట్టి)

నిర్వచనము:

బైబిలు కాలములో “ద్రాక్షరసపు గానుగ” అనేది ఒక పెద్ద తొట్టి లేక మద్యపానముగా చేసే క్రమములో ద్రాక్షారసమును సేకరించే ఒక స్థలము.

  • ఇశ్రాయేలులో ద్రాక్షారసపు తొట్టి చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి, బలమైన రాతితో త్రవ్విన విస్తృతమైన హరివాణాలు. ద్రాక్షా గుత్తులు గానుగ తొట్టెలో వెడెల్పుగా పరిచి, ప్రజలు తమ కాళ్ళతో వాటిని బాగుగా త్రొక్కుతారు. తద్వారా అందులోనుండి ద్రాక్షారసం బయటకు వస్తుంది.
  • సాధారణముగా ద్రాక్షా గానుగలో రెండు గట్టాలు ఉంటాయి, పైభాగములో ద్రాక్షా గుత్తులను కాళ్ళతో తొక్కుట ద్వారా దానిలోని రసమంతా క్రింది భాగములో దానినంతటిని సంగ్రహించే స్థలానికి చేరుకుంటుంది.
  • “ద్రాక్షా గానుగ” అనే ఈ మాట కూడా పరిశుద్ధ గ్రంథములో ఒక అలంకారిక మాటగా ఉపయోగించబడింది, ఇది దుష్ట ప్రజలపైన దేవుని ఉగ్రత కుమ్మరించబడుటను సూచిస్తుంది.

(చూడండి: రూపకలంకారము)

(ఈ పదాలను కూడా చూడండి: ద్రాక్షి, ఉగ్రత)

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1660, H3342, H6333, G3025, G5276