2.2 KiB
2.2 KiB
ఆసాఫు
వాస్తవాలు:
ఆసాఫు లేవీయుడు, యాజకుడు. వరం గల సంగీతకారుడు. అతడు దావీదు రాజు కీర్తనలకు సంగీతం సమకూర్చాడు. అతడు తన స్వంత కీర్తనలు కూడా రాశాడు.
- ఆసాఫు దావీదు రాజుచే నియమించ బడిన ముగ్గురు సంగీత విద్వాంసుల్లో ఒకడు. ఆలయంలో ఆరాధన నిమిత్తం పాటలు కూర్చడం వీరి బాధ్యత. ఈ పాటల్లో కొన్ని ప్రవచనాలు కూడా.
- ఆసాఫు తన కుమారులకు శిక్షణ నిచ్చాడు. వారు ఆ బాధ్యత కొనసాగించారు. ఆలయంలో సంగీత వాయిద్యాలు వాయిస్తూ ప్రవచిస్తూ ఉన్నారు.
- ఈ సంగీత వాయిద్యాలు వేణువు, వీణ, బాకా, తాళాలు.
- కీర్తనలు 50, 73-83 ఆసాఫు రాసినవని అంటారు. ఈ కీర్తనల్లో కొన్ని తన కుటుంబ సభ్యులు రాసి ఉండ వచ్చు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: సంతతి వాడు, వీణ, వేణువు, ప్రవక్త, కీర్తనలు, బాకా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H623