te_tw/bible/other/tradition.md

3.2 KiB

సంప్రదాయం, సంప్రదాయాలు

నిర్వచనం:

"సంప్రదాయం" అంటే చాలా కాలంగా తరతరాలుగా వస్తున్న వాడుక, లేక ఆచరణ.

  • తరచుగా బైబిల్లో "సంప్రదాయాలు" అంటే మనుషుల బోధలు, ఆచారాలు. దేవుని చట్టాలు కాదు. "మానవ సంప్రదాయం” లేక “మానవుల సంప్రదాయం" అనేది స్పష్టం చెయ్యాలి.makes clear.
  • "పెద్దల సంప్రదాయాలు” లేక “పితరుల సంప్రదాయాలు" అంటే ఇదమిద్ధంగా యూదుల వాడుక, ఆచారాలు. యూదునాయకులు తరతరాలుగా దేవుని చట్టాలతో బాటు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఇచ్చినవి. అదనంగా వచ్చిన ఈ సంప్రదాయాలు దేవుని నుండి రాకపోయినా ప్రజలు తాము వాటికి లోబడాలని, అలా అయితేనే తాము న్యాయవంతులుగా ఎంచాబడతామని నమ్మేవారు. .
  • అపోస్తలుడు పౌలు "సంప్రదాయం" అనే మాటను వివిధరకాలుగా ఉపయోగించాడు. దేవుని నుండి వచ్చిన క్రైస్తవులు ఆచరించవలసిన బోధలు అతడు, ఇతర అపోస్తలులు కొత్తవిశ్వాసులకు బోధించారు
  • ఆధునిక కాలంలో అనేక క్రైస్తవ సంప్రదాయాలు బైబిల్లో చెప్పనివి వస్తున్నాయి. అయితే అవన్నీ అంతా ఆమోదించిన వాడుకలు, ఆచారాలు. ఈ సంప్రదాయాలను ఎప్పుడూ బైబిల్లో దేవుడు బోధిస్తున్న దాని వెలుగులో చూడాలి.

(చూడండి: అపోస్తలుడు, విశ్వసించు, క్రైస్తవుడు, పూర్వీకుడు, తరం, యూదుడు, చట్టం, మోషే)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G3862, G3970