te_tw/bible/other/generation.md

3.2 KiB

తరం

నిర్వచనం:

"తరం" అంటే ఒకే కాలంలో పుట్టి పెరిగిన ప్రజా సమూహం.

  • తరం అనే మాటను ఒక ఇదమిద్ధమైన కాలాన్ని సూచించడానికి కూడా వాడతారు. బైబిల్ కాలాల్లో, తరం అంటే సుమారు 40 సంవత్సరాలు.
  • తల్లిదండ్రులు, వారి పిల్లలు రెండు వివిధ తరాలు.
  • బైబిల్లో, "తరం" అనే మాటను అలంకారికంగా సాధారణంగా ఒకే విధమైన గుణ లక్షణాలుగల మనుషులను సూచించడానికి ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు

  • "తరం” లేక “తరం ప్రజలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఇప్పుడు నివసించే ప్రజలు” లేక “మీరు."
  • " దుష్ట తరం" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. " ఇప్పుడు ఈ దుష్ట ప్రజలున్న కాలం."
  • "తరం నుండి తరం” లేక “ఒక తరం మరుసటి తరం వరకు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రస్తుతం నివసించే ప్రజలు, వారి పిల్లలు లేక మనవలు” లేక “ప్రతి సమయం లో ఉన్న ప్రజలు” లేక “ప్రస్తుతం, భవిషత్తు సమయాల్లో ఉండే మనుషులు” లేక “మనుషులంతా వారి సంతానం."
  • "రానున్న తరం ఆయన్ను సేవిస్తారు; వారు మరుసటి తరం వారికి యెహోవాను గురించి చెబుతారు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అనేక మంది ప్రజలు భవిషత్తులో యెహోవాను సేవిస్తారు, అయన గురించి వారి పిల్లలకు మనవలకు చెబుతారు."

(చూడండి: సంతతి వాడు, దుష్టత్వం, పూర్వీకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం: