te_tw/bible/other/thief.md

3.4 KiB

దొంగ, దొంగలు, దోచుకొను, దోచుకొన్న, దోపిడీ దొంగలు, దోపిడీ

వాస్తవాలు:

"దొంగ" అంటే ఇతరులకు చెందిన ధనం, ఆస్తులు తీసుకునే వ్యక్తి. "దొంగ" బహువచనం "దొంగలు." "దోపిడి గాడు అంటే తాను దోచుకున్న వారికి శారీరికంగా హాని కలిగించే వాడు.

  • యేసు చెప్పాడు ఒక సమరయ మనిషిని గురించిన కథ చెప్పాడు. అతడు దోపిడీ దొంగల చేతిలో చిక్కి గాయపడిన యూదు మనిషిను ఆదుకున్నాడు. దోపిడీ దొంగలు యూదుమనిషిని కొట్టి గయా పరిచారు. అతని డబ్బు బట్టలు ఎత్తుకెళ్ళారు.
  • దొంగలు, దోపిడీదారులు దొంగతనానికి హటాత్తుగా, అంటే మనుషులు ఉహించని సమయంలో వస్తారు. తరచుగావారు చీకటి మాటున వస్తారు. తాము చేసేది ఎవరికీ కనబడకుండా ఉంటారు.
  • అలంకారికంగా చూస్తే కొత్త నిబంధనలో సాతానును దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి వచ్చే దొంగతో పోల్చారు. అంటే సాతాను యొక్క పథకం దేవుని ప్రజలను ఆయనకు లోబడకుండా చెయ్యడం. అతడు ఇలా చెయ్యగలిగితే దేవుడు తన ప్రజల కోసం ఉంచిన మంచి విషయాలను సాతాను దోచుకున్నట్టు అవుతుంది.
  • యేసు తన రాకడ దొంగతనం చేసే వాడు అనుకోకుండా రావడంతో పోల్చాడు. దొంగ ఏ విధంగా ఎవరూ ఎదురు చూడని సమయంలో వస్తాడో అలానే యేసు రెండవ రాక కూడా మనుషులు ఉహించని సమయంలో ఉంటుంది.

(చూడండి: దీవించు, నేరం, సిలువ వేయు, చీకటి, నాశనకర్త, శక్తి, సమరయ, సాతాను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1214, H1215, H1416, H1589, H1590, H1980, H6530, H6782, H7703, G727, G1888, G2417, G2812, G3027