te_tw/bible/other/darkness.md

4.0 KiB

చీకటి

నిర్వచనం:

ఈ పదం "చీకటి" అంటే అక్షరాలా వెలుగులేని స్థితి. అలంకారికంగా ఈ పదానికి అనేక అర్థాలున్నాయి.

  • రూపకాలంకారంగా, "చీకటి" అంటే "అపవిత్రత” లేక “దుష్టత్వం” లేక “ఆత్మ సంబంధమైన అంధత్వం."
  • పాపానికి నైతిక దుష్టత్వానికి సంబంధించిన వాటిని ఇది సూచిస్తున్నది.
  • "చీకటి ఆధిపత్యం" అనే మాట సాతాను దుష్ట పరిపాలనను సూచిస్తున్నది.
  • "చీకటి" అనే పదాన్ని రూపకాలంకారంగా మరణం కోసం ఉపయోగిస్తారు. (చూడండి: రూపకాలంకారంగా
  • దేవుణ్ణి ఎరగని వారు "చీకటిలో జీవిస్తున్నారు," అంటే వారు నీతిని అర్థం చేసుకోలేరు, పాటించలేరు.
  • దేవుడు వెలుగు (నీతి). చీకటి (దుష్టత్వం) వెలుగును ఓడించలేదు.
  • ఇది కొన్ని సార్లు దేవుణ్ణి తిరస్కరించిన వారుండే శిక్షాస్థలాన్నిసూచిస్తుంది. "బయటి చీకటి."

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని అక్షరాలా అనువదించడం మంచిది. వెలుగు లేని స్థితిని ఇది సూచిస్తున్నది. ఈ పదం ఒక గదిలోని చీకటిని, లేక వెలుతురూ లేని సమయంలో ఉండే చీకటిని సూచిస్తున్నది.
  • అలంకారికంగా ఉపయోగం విషయానికి వస్తే చీకటికి, వెలుగుకు తేడా ప్రాముఖ్యతను గుర్తించి దుర్మార్గత, కపటాలకు, మంచితనం, సత్యాలకు అంతరం చూపడానికి ఈ పదం వాడతారు.
  • సందర్భాన్ని బట్టి, అనువదించడంలో ఇతర పద్ధతులు "రాత్రి చీకటి" ("పగటి వెలుగు") లేక "రాత్రి సమయంలో లాగా ఏదీ కనబడ కుండా” లేక “చీకటి స్థలం వలె దుష్టత్వం.”

(చూడండి: చెడిన, ఆధిపత్యం, రాజ్యం, వెలుగు, విమోచించు, న్యాయవంతుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H652, H653, H2816, H2821, H2822, H2825, H3990, H3991, H4285, H5890, H6205, G2217, G4652, G4653, G4655, G4656