te_tw/bible/other/light.md

5.1 KiB

వెలుగు, వెలుగులు, వెలుతురు, మెరుపు, పగటివెలుతురు, సంధ్యవెలుగు, విశదపరచడం(వెలుగు కలగడం), జ్ఞానం పొందడం

నిర్వచనం:

బైబిలులో “వెలుగు” పదానికి అనేక అలంకారిక ప్రయోగాలు ఉన్నాయి. ఈ పదం తరుచుగా నీతి, పవిత్రత, సత్యం అనే పదాల కోసం ఉపమానాలంకారంగా ఉపయోగించబడింది. (చూడండి:రూపకం)

  • లోకానికి దేవుని సత్య సందేశాన్ని తాను తీసుకొని వచ్చానని చెప్పడానికీ, వారి పాప చీకటి నుండి వారిని విడిపించడానికి తాను వచ్చినట్లు చెప్పడానికీ ”నేను లోకానికి వెలుగు” అని యేసు చెప్పాడు.
  • క్రైస్తవులు ”వెలుగులో నడవండి” అనే ఆజ్ఞను అను ఆజ్ఞను పొందారు. అంటే దుర్మార్గాన్ని విడిచి, దేవుడు కోరిన విధంగా జీవించాలని అర్థం.
  • ”దేవుడు వెలుగు” ఆయనలో చీకటి ఎంతమాత్రమునూ లేదు అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు.
  • వెలుగు, చీకటి పూర్తిగా పరస్పర వైరుధ్యాలు. చీకటి అంటే వెలుగు లేకపోవడం.
  • ”లోకానికి వెలుగును” అని ప్రభువైన యేసు చెప్పాడు, దేవుడు ఎంత గొప్పవాడో స్పష్టంగా చూపించే మార్గంలో జీవించడం ద్వారా ఆయన అనుచరులు జ్యోతుల్లా ప్రకాశించాలి.
  • ”వెలుగులో నడవడం” అంటే దేవుణ్ణి సంతోషపెట్టే మార్గంలో జీవించడం, మంచిదానినీ, సరియైనదానినీ చెయ్యడం. చీకటిలో నడవడం అంటే దేవునికి వ్యతిరేకంగా దుష్టక్రియలను చేస్తూ తిరుగుబాటులో జీవించడం,

అనువాదం సూచనలు:

  • అనువాదం చేసేటప్పుడు, “వెలుగు” “చీకటి” అనే పదాలు రూపకాలంకారంగా వినియోగించబడినప్పటికీ వీటిని అక్షరార్ద పదాలను ఉంచడం ప్రాముఖ్యం.
  • వచనభాగంలో ఉన్న పోలికను వివరించడం అవసరం. ఉదాహరణకు, “వెలుగు సంబంధులవలే నడుచుకొనుడి” అను వాక్యం ప్రకాశమైన సూర్యుని కాంతిలో ఒకరు నడచిన విధంగా “నీతి జీవితాలను నిష్కపటంగా జీవించండి” అని అనువదించవచ్చు.
  • ”వెలుగు”ను అనువదించేటప్పుడు, దీపం వంటి వెలుగును ఇచ్చే వస్తువును సూచించేదిగా ఉండకూడదు. ఈ పదం అనువాదం దాని వెలుగును సూచించాలి.

(చూడండి: చీకటి, పవిత్రత (పరిశుద్ధత), నీతి, సత్యం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H216, H217, H3313, H3974, H4237, H5051, H5094, H5105, H5216, H6348, H7052, H7837, G681, G796, G1645, G2985, G3088, G5338, G5457, G5458, G5460, G5462