7.5 KiB
7.5 KiB
సత్యమైన, సత్యం
నిర్వచనం:
"సత్యం" పదం వాస్తవాలనూ, సంఘటనలనూ, వాస్తవానికి సంబంధించిన ప్రకటనలనూ సూచిస్తుంది. నిజమైన (సత్యమైన) వాస్తవాలు విశ్వం నిజంగా ఉందని వివరిస్తాయి. సత్యమైన సంఘటనలు వాస్తవంగా జరిగిన సంఘటనలు. నిజమైన ప్రకటనలు వాస్తవ లోకం ప్రకారం అబద్దపు ప్రకటనలు కాదు.
- "నిజమైన" సంగతులు నిజమైనవి, యదార్ధమైనవి, అసలైనవి, న్యాయబద్ధమైనవి, వాస్తవమైనవి.
- సత్యం అంటే సత్యం అయిన అవగాహనలు, నమ్మకాలు, వాస్తవాలు లేదా ప్రకటనలు.
- ప్రవచనం "నెరవేరింది” లేదా “జరుగుతుంది" అంటే అది ముందుగా ఊహించి చెప్పినట్టుగా నిజంగా జరిగింది లేదా ఆ విధంగా జరుగుతుంది అని అర్థం.
- బైబిలులో "సత్యం" విషయమైన భావనలో ఆధారపడదగిన, లేక విశ్వసనీయ విధానంలో చెయ్యడం గురించిన భావన ఉంది.
- యేసు చెప్పిన మాటలలో దేవుని సత్యం వెల్లడి బయలు పడింది.
- బైబిలు సత్యమై ఉంది. ఇది దేవుని గురించి సత్యమైన దానిని బోధిస్తుంది. ఆయన చేసిన సమస్తం గురించి బోధిస్తుంది.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి, వివరించబడిన దానిని బట్టి "సత్యం" పదం "నిజమైన" లేదా "వాస్తవమైన" లేదా సరియైన" లేదా "నిశ్చితమైన" లేదా "యదార్ధమైన" అని అనువదించబడవచ్చు.
- "సత్యం" పదం "సత్యమైనది" లేదా "వాస్తవం" లేదా "నిశ్చయం" లేదా "సూత్రం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
- "నెరవేరింది" అనే పదబంధం "నిజంగా జరుగుతుంది" లేదా "నెరవేరుతుంది" లేదా "ఊహించినట్లుగా జరుగుతుంది" అని అనువదించబడవచ్చు.
- "సత్యం చెప్పు" లేదా "సత్యం మాట్లాడు" వాక్యాలు "సత్యం అయినదానిని మాట్లాడు" లేదా "నిజంగా జరిగినదానిని చెప్పు" లేదా "నమ్మదగిన వాటిని మాట్లాడు" అని అనువదించవచ్చు. * "సత్యం అంగీకరించు" వాక్యం "దేవుని గురించి సత్యం అయినదానిని విశ్వసించు" అని అనువదించవచ్చు.
- "దేవుణ్ణి ఆత్మలోనూ, సత్యంలోనూ ఆరాధించు" వాక్యంలో "సత్యంలో" పదం "దేవుడు మనకు బోధించిన దానికి నమ్మకంగా విధేయత చూపించు" అని అనువదించబడవచ్చు.
(చూడండి: విశ్వసించు, విశ్వసనీయత, నెరవేర్చు, లోబడు, ప్రవక్త, అవగాహన)
బైబిలు రిఫరెన్సులు:
- 1 కొరింథీ 05:6-8
- 1 యోహాను 01:5-7
- 1 యోహాను 02:08
- 3 యోహాను 01:08
- అపొ. కా. 26:24-26
- కొలస్సీ 01:06
- ఆది. 47:29-31
- యాకోబు 01:18
- యాకోబు 03:14
- యాకోబు 05:19
- యిర్మీయా 04:02
- యోహాను 01:9
- యోహాను 01:16-18
- యోహాను 01:51
- యోహాను 03:31-33
- యెహోషువా 07:19-21
- విలాపవాక్యములు 05:19-22
- మత్తయి 08:10
- మత్తయి 12:17
- కీర్తనలు 026:1-3
- ప్రకటన 01:19-20
- ప్రకటన 15:3-4
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 02:04 సర్పం స్త్రీకి ఇలా జవాబిచ్చింది, "అది నిజం! మీరు చనిపోరు."
- 14:06 వెంటనే కాలేబు, యెహోషువా, అనే ఇద్దరు గూఢచారులు, చెప్పారు, "అది నిజం, కనాను వాసులు పొడవైన బలమైన వారు., అయితే మనం తప్పనిసరిగా వారిని ఓడించగలం!"
- 16:01 ఇశ్రాయేలీయులు నిజమైన దేవుడు అయిన యెహోవాకు బదులు కనానీయుల దేవుళ్ళను పూజించడం ఆరంభించారు.
- 31:08 వారు యేసును ఆరాధించారు, "నిజముగా నీవు దేవుని కుమారుడవు" అన్నారు.
- 39:10 "నేను దేవుణ్ణి గురించిన సత్యం చెప్పడానికి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ నా మాట వింటారు." పిలాతు అన్నాడు, "సత్యం" అంటే ఏమిటి?"
పదం సమాచారం:
- Strong's: H199, H389, H403, H529, H530, H543, H544, H551, H571, H935, H3321, H3330, H6237, H6656, H6965, H7187, H7189, G225, G226, G227, G228, G230, G1103, G3303, G3483, G3689, G4103, G4137