te_tw/bible/kt/bless.md

7.8 KiB

ఆశీర్వదించు, ఆశీర్వదించబడిన, ఆశీర్వాదం

నిర్వచనం:

ఎవరినైనా లేక దేనినైనా "ఆశీర్వదించడం" అంటే ఆశీర్వదించబడుతున్న వ్యక్తికి మంచివీ, మరియు ప్రయోజనకరమైన విషయాలు కలిగేలా చెయ్యడం అని అర్థం.

  • ఎవరినైనా ఆశీర్వదించడం అంటే ఆ వ్యక్తికి సానుకూలమైనవి, ప్రయోజనకరమైనవి జరగాలనే కోరికను వ్యక్తపరచడం.
  • బైబిలు కాలాలలో, ఒక తండ్రి తరచుగా తన పిల్లలమీద ఆశీర్వాదం ఉచ్చరిస్తాడు.
  • ప్రజలు దేవుణ్ణి "ఆశీర్వదిస్తున్నారు" లేదా దేవుడు ఆశీర్వదించబడాలనే కోరికను వ్యక్తపరుస్తున్నారు అంటే వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అని అర్థం.
  • పదం "ఆశీర్వదించు" పదం కొన్నిసార్లు ఆహారాన్ని తీసుకోడానికి ముందు దానిని పవిత్రపరచడం కోసం లేదా ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికీ, దేవుణ్ణి స్తుతించడానికీ ఉపయోగించబడుతుంది.

అనువాదం సూచనలు:

  • "ఆశీర్వదించడానికి" అనే పదం "సమృద్ధిగా సమకూర్చడం కోసం" లేదా "చాలా దయతోనూ, అనుకూలంగానూ ఉండడం" అని అనువదించబడవచ్చు.
  • "దేవుడు గొప్ప ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు" వాక్యాన్ని "దేవుడు అనేక మంచి సంగతులు అనుగ్రహించాడు" లేదా "దేవుడు సమృద్ధిగా సమకూర్చాడు" లేదా “దేవుడు అనేక మంచి విషయాలు జరిగేలా చేశాడు" అని అనువదించవచ్చు.
  • "అతడు ఆశీర్వదించబడినవాడు" అనే వాక్యం "అతడు ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అతడు గొప్పగా ప్రయోజనాన్ని పొందుతాడు" లేదా "అతడు “అతడు మంచి వాటిని అనుభవిస్తాడు” లేదా “దేవుడు అతడు వర్ధిల్లేలా చేస్తాడు" అని అనువదించవచ్చు.
  • "ఆ వ్యక్తి ఆశీర్వదించబడినవాడు" వాక్యాన్ని "అటువంటి వ్యక్తికి ఇది ఎంత శ్రేష్ఠమైనది" అని అనువదించవచ్చు.
  • "ప్రభువు స్తుతింపబడును" లాంటి వ్యక్తీకరణలు "దేవుడు స్తుతి నొందును గాక" లేదా "దేవునికి స్తోత్రం" లేదా "నేను ప్రభువును స్తుతిస్తున్నాను" అని అనువదించబడవచ్చు.
  • ఆహారాన్ని ఆశీర్వదించడం సందర్భంలో ఇది "ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం" లేదా "వారికి ఆహారం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించారు" లేదా "దాని కోసం దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఆహారాన్ని పవిత్ర పరచారు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: స్తుతి)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 01:07 అది మంచిదని దేవుడు చూశాడు. మరియు వారిని ఆశీర్వదించాడు.
  • 01:15 దేవుడు ఆదాము, హవ్వలను తన స్వంత స్వరూపంలో చేసాడు. అయన వారిని ఆశీర్వదించాడు"మరియు వారితో, "మీరు అనేకమంది పిల్లలనూ మనుమ సంతానాన్ని కలిగి యుండండి మరియు భూమిని నింపండి" అని చెప్పాడు.
  • 01:16 కాబట్టి దేవుడు తాను చేస్తున్న పని అంతటి నుండి విశ్రమించాడు. ఆయన ఏడవ రోజును ఆశీర్వదించాడు మరియు దానిని పవిత్రపరచాడు ఎందుకంటే ఆ రోజున ఆయన తన పని నుండి విశ్రమించాడు.
  • 04:04 "నీ పేరును గొప్ప చేస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను మరియు నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ నీ వలన ఆశీర్వాదం పొందుతాయి."
  • 04:07 మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించాడు. మరియు "పరలోకానికీ, భూమికీ అధికారి అయిన సర్వోన్నతుడైన దేవుడు అబ్రామును ఆశీర్వదించును గాక" అని చెప్పాడు.
  • 07:03 ఇస్సాకు ఏశావుకు తన ఆశీర్వాదం ఇవ్వాలని కోరాడు.
  • 08:05 చెరసాలలో సైతం, యోసేపు దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు.

పదం సమాచారం:

  • Strong's: H833, H835, H1288, H1289, H1293, G1757, G2127, G2128, G2129, G3106, G3107, G3108, G6050