te_tw/bible/names/balaam.md

3.2 KiB

బిలాము

వాస్తవాలు:

బిలాము ఒక అన్య ప్రవక్త. ఉత్తర మోయాబు ప్రాంతంలో యోర్దాను నది దగ్గర ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రదేశం చేరడానికి వచ్చి ఉన్నప్పుడు వారిని శపించడానికి బాలాకు రాజు అతణ్ణి డబ్బిచ్చి తెప్పించాడు.

  • బిలాము పెతోరు ఊరి వాడు. ఇది యూఫ్రటిసు నది వద్ద మోయాబు దేశానికి 400మైళ్ళు దూరాన ఉంది.
  • మిద్యాను రాజు, బాలాకు, ఇశ్రాయేలీయుల బలానికీ, ఇశ్రాయేలీయులు బలానికి, సంఖ్యా బలానికీ భయపడి వారిని శపించడానికి బిలామును డబ్బిచ్చి తీసుకు వచ్చాడు.
  • బిలాము ప్రయాణిస్తూ ఉండగా ఒక దేవదూత ఆతని దారికి అడ్డంగా నిలబడ్డాడు. బిలాము ఎక్కి వెళుతున్న గాడిద ఆగిపోయింది. దేవుడు గాడిదకు బిలాముతో మాట్లాడే సామర్థ్యం ఇచ్చాడు.
  • దేవుడు ఇశ్రాయేలీయులను శపించడానికి అతనికి అనుమతి ఇవ్వలేదు. దానికి బదులుగా దీవించమని అజ్ఞాపించాడు.
  • తరువాత బిలాము ఇశ్రాయేలీయులీయుల పైకి కీడు రప్పించాడు. అబద్ధ దేవుడు బయలు-పెయోరును పూజించడానికి అతడు వారికి ప్రేరణ కలిగించడం ద్వారా దీన్ని సాధించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: దీవించు, కనాను, శాపం, గాడిద, యూఫ్రటిసు నది, యోర్దాను నది, మిద్యాను, మోయాబు, పెయోరు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1109, G903