te_tw/bible/kt/curse.md

4.7 KiB

శాపం, శపించి, శాపాలు, శపించడం

నిర్వచనం:

ఈ పదం "శాపం" అంటే ఒక వ్యక్తికి ఏదైనా హాని జరిగేలా పలకడం.

  • శాపం అంటే ఎవరికైనా, దేనికైనా హాని తలపెట్టడం.
  • ఎవరినైనా శపించడం అనే మాట వారికి హాని జరగాలని కోరుకోవడం.
  • అది శిక్ష లేక ఇతర హానికరం అయినవి ఎవరికైనా జరగాలని పలకడం.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్నిఅనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"హాని కలిగించడం” లేక “కీడు జరిగేలా ప్రకటించు” లేక “చెడు సంభవించేలా శాపం పెట్టడం."
  • దేవుడు తనకు అవిధేయులైన ప్రజలపై శాపాలు పంపించే సందర్భంలో ఇలా అనువదించ వచ్చు, "హాని సంభవించడానికి అనుమతి ఇచ్చి శిక్షించు."
  • ఈ పదం "శపించి" అనేదాన్ని ఇలా అనువదించ వచ్చు, "(వ్యక్తి) ఎక్కువ ఇబ్బంది పడేలా చెయ్యడం."
  • పద బంధం “శపితుడు" ను ఇలా అనువదించ వచ్చు, "ఒక వ్యక్తి గొప్ప దురవస్థలు అనుభవించేలా."
  • పద బంధం, "నేలను శపించి" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, " నేల సారవంతంగా ఉండదు."
  • "నేను పుట్టిన దినాన్ని శపించి" అనే దాన్ని అని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నేనెంత దురవస్థలో ఉన్నానంటే నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది."
  • అయితే, లక్ష్య భాషలో "శపితుడు" అనే అర్థం ఇచ్చే పదం ఉంటే దాన్ని వాడడం మంచిది.

(చూడండి: దీవించు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 02:09 దేవుడు సర్పంతో చెప్పాడు, "నీవు శాపానికి గురి అయ్యావు!"
  • 02:11 "ఇప్పుడు నేల శపించబడింది. నీవు ఆహారం కోసం నీవు కష్టపడాలి."
  • 04:04 "నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను. నిన్ను శపించే వారిని శపిస్తాను."
  • 39:07 తరువాత పేతురు ఒట్టు పెట్టుకుని ఆ మనిషిని నేనెరిగి ఉంటే దేవుడు నాకు శాపం పెట్టు గాక."
  • 50:16 ఆదాము, హవ్వలు లోబడలేదు గనక పాపం లోకంలోకి ప్రవేశించింది. దేవుడు లోకాన్ని శపించి దాన్ని నాశనం చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H422, H423, H779, H1288, H2763, H2764, H3994, H5344, H6895, H7043, H7045, H7621, H8381, G331, G332, G685, G1944, G2551, G2652, G2653, G2671, G2672, G6035