te_ta/translate/resources-types/01.md

10 KiB
Raw Permalink Blame History

ULT నుండి తర్జుమా

  • ULT చదవండి. మీ భాషలోకి కచ్చితంగా స్పష్టంగా సహజంగా అనువాదం చెయ్యడానికి వీలుగా అది ముకు అర్థం అయిందా?
    • అవునా? అయితే అనువాదం మొదలు పెట్టండి.
  • కాదా? UST చూడండి. ULT వాచకం అర్థం చేసుకోడానికి UST మీకు సహాయపడుతున్నదా?
    • అవునా? తర్జుమా మొదలెట్టండి.
  • కాదా? సహాయం కోసం ట్రాన్స్ లేషన్ నోట్సు చదవండి.

ట్రాన్స్ లేషన్ నోట్సు అంటే ULT నుండి ఎత్తి రాసి, ఆపైన వివరించిన పదాలు, లేక పదబంధాలు. ఇంగ్లీషులో ULT నీ వివరించే ప్రతి నోట్ ఒకేలా మొదలౌతాయి. బుల్లెట్ పాయింట్లు ఉంటాయి. ULT వాచకం బోల్డులో తరువాత ఒక డాష్, ఆ తరువాత అనువాదకునికి సహాయపడే సలహాలు, సమాచారం ఉంటాయి. నోట్సు ఈ క్రింది ఫార్మాట్ లో ఉంటుంది.

  • *కాపీ చేసిన ULT వాచకం - అనువాదకునికి సహాయపడే సలహాలు, సమాచారం.

నోట్సు రకాలు

ట్రాన్స్ లేషన్ నోట్సు లో రకరకాల నోట్సు ఉంటాయి. ప్రతి నోట్సు వేరువేరు మార్గాల్లో వివరణలు ఇస్తాయి. నోట్సు రకం ఎరిగి ఉండడం అనువాదకునికి బైబిల్ వాచకాన్ని వేరే భాషలోకి ఉత్తమంగా తర్జుమా చెయ్యడానికి సరైన నిర్ణయం చేసుకోడానికి తోడ్పడుతుంది.

  • నిర్వచనాలతో నోట్సు - కొన్ని సార్లు ULTలో ఒక పదం అర్థం మీకు తెలియక పోవచ్చు. పదాల, పద బంధాల సరళమైన నిర్వచనాలు కోట్సు గానీ వాక్య రీతి గానీ లేకుండా జోడించబడ్డాయి
  • వివరించే నోట్సులు - పడాల పదబంధాల తేలికపాటి వివరణలు వాక్య శైలిలో ఉంటాయి.
  • **ప్రత్యామ్నాయ రీతిలో తర్జుమా చేయమని సూచించే నోట్సు ** - ఈ నోట్సు వివిధ రకాలుగా ఉన్నందువల్ల వాటిని మరింత వివరంగా ఈ క్రింద వర్ణిస్తున్నాము

అనువాద సలహాలు

అనేక రకాలైన అనువాద సలహాలు ఉన్నాయి

  • సమానార్థక లేక ఒకే అర్థం ఇచ్చే పదబంధాలను తెలిపే నోట్సు - కొన్ని సార్లు నోట్సు ULTలో ఉన్న పదాల, పదబంధాల స్థానంలో ఉంచదగిన ప్రత్యామ్నాయాలను ఇస్తుంది. ఈ ప్రత్యామ్నాయాలు వాక్యం అర్థం మార్చకుండా వాక్యంలో ఒదిగిపోతాయి. ఈ సమానార్థకాలు డబుల్ కోట్స్ లో ఉంటాయి. ULT లో ఉన్న అర్థమే ఇవి కూడా ఇస్తున్నాయని దీని అర్థం.
  • ప్రత్యామ్నాయ అనువాదాల గురించి నోట్సు (AT) - ప్రత్యామ్నాయ అనువాదం అంటే ULT వాచకం విషయంలో గానీ శైలిలో గానీ ప్రత్రిపదించిన మార్పు. ప్రత్యామ్నాయ అనువాదం కేవలం ULT శైలి, విషయం మీ భాషలో కచ్చితం, లేక సహజం కాకపోతేనే వాడాలి.
  • UST అనువాదం స్పష్టికరించే నోట్సు - ULT, కోసUST మంచి ప్రత్యామ్నాయ అనువాదం ఇస్తున్నట్టయితే ప్రత్యామ్నాయ అనువాదం సూచించే ఎలాటి నోట్ ఇవ్వబడదు. అయితే కొన్నిసార్లు UST నుండి ప్రత్యామ్నాయ అనువాదం సూచించే నోట్సు ఉంటుంది. కొన్ని సార్లు UST నుండి ఎదో ఒక మాటను ప్రత్యామ్నాయఅనువాదంగా సూచించడం ఉంటుంది. అలాంటప్పుడు ఆ నోట్సులో UST వాచకం తరువాత "(UST)" అని ఉంటుంది.
  • ప్రత్యామ్నాయ అర్థాలు ఉన్న నోట్సులు - ఒక పదం లేక పదబంధం ఒకటి కంటే ఎక్కువ అర్థాలతో ఉన్నట్టయితే కొన్ని నోట్సు ప్రత్యామ్నాయ అర్థాలు ఇస్తాయి. ఇది జరిగినప్పుడు అన్నిటికన్నా దగ్గర అర్థం నోట్సు ఇస్తుంది.
  • సంభావ్య, లేక సాధ్య అర్థాలు ఉన్నప్పుడు కొన్ని సార్లు బైబిల్ పండితులు ఒక బైబిల్ పదం లేక పదబంధం యొక్క అర్థం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. లేక ఏకాభిప్రాయం ఉండదు. దీనికి కొన్ని కారణాలు: ప్రాచీన బైబిల్ వాచకాల్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ వాడకాలు ఉంటాయి. లేక ఒక పదం (సర్వనామం వంటిది) ఏ పదబంధాన్ని సూచిస్తున్నదో తెలియదు. అలాంటప్పుడు నోట్ లో ఎక్కువ సాధ్యమైన అర్థాలు, వాటిలో ఎక్కువ సంభావ్యమైన అర్థం మొదట ఇవ్వబడుతుంది.
  • భాషాలంకరాలను గుర్తించే నోట్సు - ULT వాచకంలో భాషాలంకరాలు ఉన్నప్పుడు దాన్ని తర్జుమా చేసే విధానాన్ని నోట్సు సూచిస్తుంది. కొన్ని సార్లు ప్రత్యామ్నాయఅనువాదం (AT:) ఇవ్వబడుతుంది. అదనపు సమాచారం కోసం, అనువాద వ్యూహాల కోసం ట్రాన్స్లేషన్ అకాడెమీ పేజీకి కూడా లింక్ ఇవ్వబడుతుంది. అక్కడ ఉన్న భాషాలంకారాన్ని కచ్చితంగా తర్జుమా చెయ్యడం కోసం దాని రకం, భావం వివరణ ఉంటుంది.
  • ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించే నోట్సు - రెండు రకాల కొటేషన్లు ఉంటాయి: ప్రత్యక్ష, పరోక్ష. ఒక కొటేషన్ నీ తర్జుమా చేసేటప్పుడు అనువాదకులు అక్కడి విషయాన్ని ప్రత్యక్ష, లేక పరోక్ష పద్ధతిలో తర్జుమా చేసే నిర్ణయం చేసుకోవాలి. అక్కడ చేసుకోవలసిన ఎంపిక విషయం ఈ నోట్సు అనువాదకుడిని హెచ్చరిస్తాయి.
  • సుదీర్ఘమైన ULT పదబంధాలను సూచించే నోట్సు - కొన్ని సార్లు పదబంధాలకు సంబంధించిన నోట్సు, ఆ పదబంధంలోని వేరు వేరు భాగాలను వివరించే నోట్సు ఉంటాయి. అలాంటప్పుడు పెద్ద పదబంధం కోసం ఉన్న నోట్సు మొదటిది. చిన్నవాటికి చెందినది తరువాతిది. ఆ విధంగా నోట్సు అనువాద సలహాలు వివరణలు మొత్తంగా గానీ భాగాలుగా గానీ ఇస్తుంది.