te_tw/bible/other/pagan.md

2.0 KiB
Raw Permalink Blame History

అన్యమతస్థులు

నిర్వచనము:

బైబిలు కాలాలలో, యెహోవాకు బదులుగా అబద్ధ దేవుళ్లను ఆరాధించే వ్యక్తులను వివరించడానికి “అన్యమతస్థుడు” అనే పదాన్ని ఉపయోగించారు.

  • ఈ ప్రజలతో సంబంధము కలిగియుండే ఏదైననూ, వారు ఆరాధించే స్థలమైన బలిపీఠములు, వారు జరిగించే ఆచారములు మరియు వారి నమ్మకములు అన్నియూ “అన్యమతసంబంధమైనవి” అని కూడా పిలువబడ్డాయి.
  • అన్య నమ్మకాలలో తరచుగా తప్పుడు దేవుళ్ళను ఆరాధించడము మరియు ప్రకృతిని ఆరాధించడము ఉంటాయి.
  • కొన్ని అన్య మతాలలో లైంగికపరమైన అనైతిక ఆచారాలు లేక వాటిని ఆరాధించడములో భాగంగా మనుష్యులను చంపే ఆచారాలను కలిగియుంటారు.

(ఈ పదాలను కూడా చూడండి: బలిపీఠం, అబద్ద దేవుడు, సర్వాంగ హోమము, ఆరాధన, యెహోవ)

బైబిలు రిఫరెన్పసులు:

పదం సమాచారం:

  • Strong's: H1471, G1484