4.8 KiB
4.8 KiB
సీల, సిల్వాను
వాస్తవాలు:
సీల యెరూషలేములోని విశ్వాసుల మధ్య నాయకుడిగా ఉన్నాడు.
- యెరూషలేములోని సంఘ పెద్దలందరు అంతియొకయ పట్టణమునకు పత్రికను తీసుకొని వెళ్ళుటకు పౌలు మరియు బర్నబాలతో వెళ్ళుటకు సీలను నియమించారు.
- యేసు క్రీస్తును గూర్చి ప్రజలకు బోధించుటకు ఇతర పట్టణములకు పౌలుతో సీల ప్రయాణము చేసాడు.
- పౌలు సీలల ఫిలిప్పి పట్టణములోని చెరసాలలో వెయ్యబడ్డారు. వారు చెరసాలలో ఉన్నప్పుడే దేవునిని పాటలు పాడి స్తుతించారు. మరియు దేవుడు వారిని చెరనుండి విడిపించాడు. చెరసాల అధిపతి వారికి జరిగిన సాక్య్డము ద్వారా క్రైస్తవుడిగా మారాడు.
(అనువాదం సూచనలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: అంతియొకయ, బర్నబా, యెరూషలేము, పౌలు, ఫిలిప్పి, చెర, సాక్ష్యము)
బైబిలు రిఫరెన్సులు:
బైబిలు నుండి ఉదాహరణలు:
- 47:1 ఒక రోజున పౌలు మరియు తన స్నేహితుడైన సీల ఇరువురు కలిసి యేసును గూర్చిన శుభవార్తను ప్రకటించుటకు ఫిలిప్పి పట్టణమునకు వెళ్ళారు. .
- __47:2__ఆమె (లుదియ) తన ఇంట బస చేయుటకు పౌలును మరియు సీలను ఆహ్వానించింది, అందుచేత వారు ఆమె ఇంట ఆమెతో పాటు బసచేసారు.
- 47:3 పౌలు మరియు సీలలు అనేకమార్లు ప్రార్థన చేసికొను స్థలములో ప్రజలను కలిసికొన్నారు.
- 47:7 అందుచేత బానిసయైన అమ్మాయి యజమానులు పౌలును మరియు సీలను రోమా అధికారుల వద్దకు తీసుకొని వెళ్లి, వారిని జైలులోనికి వేయించారు.
- 47:8 వారు పౌలు మరియు సీలను చెరసాలలోని అతీ భద్రమైన స్థలములో వేసి, వారి కాళ్లకు బొండలను బిగియించారు.
- 47:11 చెరసాల అధికారి పౌలు సీల వద్దకు వణుకుతూ వచ్చి, “నేను రక్షణ పొందుటకు ఏమి చేయవలెను?” అని అడిగాడు.
- 47:13 ఆ మరుసటి రోజున పట్టణ నాయకులు పౌలు సీలలను చెరసాలనుండి విడుదల చేసారు. మరియు ఫిలిప్పి పట్టణమును విడిచి వెళ్లిపొమ్మని వేడుకొనిరి. పౌలు మరియు సీల లుదియాను మరియు ఇతర కొంతమంది స్నేహితులను దర్శించి, పట్టణమును విడిచి వెళ్లిపోయారు.
పదం సమాచారం:
- Strong’s: G46090, G46100