te_tw/bible/names/barnabas.md

3.6 KiB

బర్నబా

వాస్తవాలు:

బర్నబా అపొస్తలులుల కాలంలో నివసించిన ఆది క్రైస్తవులలో ఒకడు.

  • బర్నబా ఇశ్రాయేలుల లేవీ గోత్రం నుండి వచ్చిన వాడు. కుప్ర సైప్రస్ దేశస్థుడు.

సౌలు (పౌలు) క్రైస్తవుడుగా మారినప్పుడు, అతన్ని సాటి విశ్వాసిగా అంగీకరించమని బర్నబా ఇతర విశ్వాసులను కోరాడు.

  • బర్నబా, పౌలు యేసును గురించి వివిధ పట్టణాల్లో సువార్త ప్రకటించడానికి కలిసి ప్రయాణించారు.
  • అతని పేరు యోసేపు, అయితే అతనికి "బర్నబా," అని పేరు పెట్టారు. అంటే "ప్రోత్సాహ పుత్రుడు."

(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా)

(వీటిని కూడా చూడండి: క్రైస్తవుడు, కుప్ర, మంచి వార్త,, లేవీయుడు, పౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 46:8 తరువాత బర్నబా అనే పేరు గల విశ్వాసి సౌలును అపొస్తలుల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. మరియు సౌలు ఏ విధంగా ధైర్యంతో దమస్కులో సువార్త బోధించాడో వారికి చెప్పాడు.
  • 46:9 బర్నబా మరియు సౌలు ఈ నూతన విశ్వాసులకు యేసును గురించి బోధించడానికి, మరియు సంఘాన్ని బలపరచడానికి అక్కడికి వెళ్లారు.
  • 46:10 ఒక రోజు అంతియొకయలో క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మవారితో చెప్పాడు, "నా కోసం బర్నబా సౌలులను నేను వారిని పిలిచిన పని కోసం ప్రత్యేక పరచండి." కాబట్టి అంతియొకయలో సంఘం బర్నబా, సౌలు కోసం ప్రార్థించారు, వారి మీద చేతులు ఉంచారు.

పదం సమాచారం:

  • Strong's: G9210