te_tw/bible/names/paul.md

6.7 KiB
Raw Permalink Blame History

పౌలు, సౌలు

వాస్తవాలు:

పౌలు ఆదిమ సంఘానికి ఒక నాయకుడు, అతడు అనేక ఇతర ప్రజా గుంపులకు సువార్తను తీసుకొని వెళ్ళడానికి యేసు చేత పంపించబడినవాడు.

  • పౌలు తార్సు అనే రోమా నగరంలో జన్మించిన యూదుడు. మరియు, కాబట్టి అతడు ఒక రోమా దేశ

పౌరుడుగా కూడా పిలువబడ్డాడు.

  • పౌలు ఆరంభంలో యూదా సంబంధ పేరు, సౌలు అని పిలువబడ్డాడు.
  • సౌలు యూదుల మత నాయకుడు అయ్యాడు. మరియు క్రైస్తవులుగా మారిన యూదులను బంధించాడు, ఎందుకంటే వారు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు దేవుణ్ణి అగౌరవపరుస్తున్నారని అతడు తలంచాడు.
  • యేసు ప్రకాశమానమైన వెలుగు ద్వారా సౌలుకు తననుతాను బయలుపరచుకొన్నాడు, మరియు క్రైస్తవులను హింసించడం నిలిపివేయాలని చెప్పాడు.
  • సౌలు యేసునందు విశ్వాసముంచాడు. తన తోటి యూదులకు యేసును గురించి బోధించడం

ఆరంభించాడు.

  • తరువాత, యేసును గురించి యూదేతరులైన ప్రజలకు  బోధించడానికి దేవుడు పంపించాడు. మరియు రోమా సామ్రాజ్యం యొక్క దేశాలలోనూ, వివిధ నగరాలలో సంఘాలను ఆరంభించాడు. ఈ సమయములో అతడు “పౌలు” అను రోమా పేరు చేత పిలువబడ్డాడు.
  • పట్టణములలో ఉన్న సంఘాలలోని క్రైస్తవులను ప్రోత్సహించడానికీ, వారికి బోధించడానికీ పౌలు ఉత్తరాలు రాశాడు. వీటిలో అనేకం క్రొత్తనిబంధనలో ఉన్నాయి.

(అనువాదం సూచనలు: పేర్లను ఏవిధంగా అనువదించాలి)

(చూడండి: క్రైస్తవుడు, యూదు నాయకులు, రోమా)

బైబిలు రిఫరెన్సులు:

  • [అపొ.కా.08:03]
  • [అపొ.కా 09:26]
  • [అపొ.కా. 13:10]
  • [గలతీ 01:01]
  • [ఫిలేమోను 01:08]

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

45:06 స్తెఫనును చంపిన ప్రజలతో సౌలు అనబడిన యౌవనస్తుడు ఏకీభవించాడు, మరియు వారు అతని మీదకి రాళ్లు విసిరినప్పుడ వారి వస్త్రాలకు కావలిగా ఉన్నాడు.

46:01 సౌలు అను యవనస్థుడు స్తెఫనును చంపిన మనుష్యుల వస్త్రాలకు కావలి ఉన్నాడు, అతడు

యేసునందు విశ్వాసం ఉంచలేదు. అందుచేత అతడు విశ్వాసులను హింసించాడు.

46:02 సౌలు దమస్కు మార్గములో ప్రయాణము చేయుచున్నప్పుడు,ఆకాశమునుండి ప్రకాశమానమై వెలుగు వచ్చి తన చుట్టూ కమ్ముకొంది. మరియు అతడు క్రిందకి పడిపోయాడు,సమయములో “సౌలా! సౌలా నన్నెందుకు నీవు హింసించుచున్నావు?” అని ఒకరు చెప్పడం సౌలు విన్నాడు.

46:05 అదుచేత అననీయ సౌలు వద్దకు వెళ్ళాడు, అతని మీద తన చేతులను ఉంచాడు. “నీవు ఇక్కడకు ప్రయాణమై దారిలో వస్తున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన యేసు నన్ను నీ యొద్దకు పంపించాడు, తద్వారా నీవు నీ చూపును తిరిగి పొందుకొని మరియు పరిశుద్ధాత్మతో నింపబడగలవు”అని చెప్పాడు. వెనువెంటనే సౌలు మరల చూడడం ఆరంభించాడు. మరియు అననియ అతనికి బాప్తిస్మం ఇచ్చాడు.

46:06 ఆ క్షణమునుండే, సౌలు “యేసే దేవుని కుమారుడని” చెప్పుచూ దమస్కులోని యూదులందరికి ప్రకటించడం ఆరంభించాడు.

46:09 బర్నబా మరియు సౌలు సంఘమును బలపరచుటకునూ, మరియు యేసును గురించి ఈ నూతన విశ్వాసులకు మరి యెక్కువగా బోధించడానికీ అక్కడికి (అంతియొకయ) వెళ్ళారు.

47:01 సౌలు రోమా సామ్రాజ్యమంతటి ద్వారా ప్రయాణించినప్పుడు అతడు “పౌలు” అనే రోమా పేరును ఉపయోగించడ ఆరంభించాడు.

45:06 పౌలు మరియు ఇతర క్రైస్తవ నాయకులు అనేక పట్టణములకు ప్రయాణము చేసి, యేసును

గూర్చిన సువార్తను ప్రజలకు బోధించి, ప్రకటించారు.

పదం సమాచారం:

  • Strong's:

G3972, G4569