5.9 KiB
5.9 KiB
మంచి వార్త, సువార్త
నిర్వచనం:
"సువార్త" అక్షరాలా దీని అర్థం "మంచి వార్త." ఇది మనుషులకు మేలు చేసే, సంతోషపెట్టే సందేశం లేక ప్రకటన.
- బైబిల్లో, ఈ పదం సాధారణంగా సిలువపై యేసు బలి అర్పణ మూలంగా ప్రజలకు దేవుని రక్షణను సూచిస్తున్నది.
- అనేక ఇంగ్లీషు బైబిళ్ళలో, "మంచి వార్త" ను సాధారణంగా అనువదించ వచ్చు "సువార్త"గా అనువదించారు. "యేసు క్రీస్తు సువార్త" "దేవుని సువార్త" "రాజ్య సువార్త" వంటి పడబంధాల్లో ఉపయోగించారు.
అనువాదం సలహాలు:
- ఈ పదాన్ని రకరకాలుగా అనువదించవచ్చు. "మంచి సందేశం” లేక “మంచి ప్రకటన ” లేక “దేవుని రక్షణ సందేశం” లేక “దేవుడు యేసును గురించి బోధించిన విషయాలు."
- సందర్భాన్ని బట్టి, దీన్ని అనువదించడం, "ఒక దాని గురించి మంచి వార్త/సందేశం” లేక “మంచి సందేశం నుండి” లేక “దేవుడు మనకు చెప్పిన మంచి మేళ్ళు” లేక “దేవుడు తాను మనుషులను రక్షించే విధానం గురించి చెప్పిన మాటలు."
(చూడండి: రాజ్యం, బలి అర్పణ, రక్షించు)
బైబిల్ రిఫరెన్సులు:
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 23:6 దేవదూత చెప్పాడు, "భయపడకండి, ఎందుకంటే మంచి వార్త మీకోసం తెచ్చాను. మెస్సియా, ప్రభువు బెత్లెహేములో పుట్టాడు!"
- __26:3__యేసు చదివాడు, "దేవుడు నాకు తన ఆత్మ ఇచ్చాడు. పేదలకు సువార్త, ఖైదీలకు స్వాతంత్ర్యం, గుడ్డి వారికి చూపు, బాధితులకు విడుదల ప్రభువు అనుగ్రహ వత్సరం గురించిన మంచి వార్త ప్రకటించాడు.
- __45:10__ఫిలిప్పు యేసు సువార్తను గురించి ఇతర లేఖనాల సహాయంతో వివరించాడు.
- 46:10 తరువాత యేసును గురించిన సువార్త అనేక ఇతర స్థలాల్లో ప్రకటించడం కోసం పంపించాడు.
- 47:1 ఒక రోజు , పౌలు తన స్నేహితుడు సీల ఫిలిప్పిపట్టణంలో యేసును గురించి సువార్త ప్రకటించారు.
- 47:13 సువార్త యేసును గురించిన సువార్త వ్యాపించ సాగింది. సంఘం ఎదుగుతూ ఉంది.
- __50:1__దాదాపు 2,000 సంవత్సరాలుగా లోకవ్యాప్తంగా ప్రజలెందరో మెస్సియా అయిన యేసును గురించిన సువార్త వింటున్నారు.
- __50:2__యేసు భూమిపై ఉన్నప్పుడు ఇలా చెప్పాడు, "నా శిష్యులు దేవుని రాజ్యం గురించిన మంచి వార్త లోకంలో అన్ని చోట్లా, మనుషులకు ప్రకటిస్తారు. ఆ తరువాత అంతం వస్తుంది."
- __50:3__అయన పరలోకానికి తిరిగి వెళ్లకముందు అంతకు ముందు ఎన్నడూ వినని వారికి క్రైస్తవులు సువార్త ప్రకటించాలని చెప్పాడు.
పదం సమాచారం:
- Strong’s: G20970, G20980, G42830