te_tw/bible/kt/christian.md

5.5 KiB

క్రైస్తవుడు

నిర్వచనం:

యేసు పరలోకానికి ఆరోహణం అయిన కొంతకాలానికి, ప్రజలు "క్రైస్తవులు" అనే పేరును ఏర్పరచుకున్నారు, దాని అర్థం ఏమిటంటే "క్రీస్తు అనుచరులు".

  • యేసు అనుచరులను మొదట “క్రైస్తవులు” అని పిలివబడేవారు, అది అంతియొకయ నగరంలోనే.
  • ఒక వ్యక్తిని యేసుని దేవుని కుమారుడని నమ్మి, మరియు తన పాపాల నుండి తనను రక్షించడానికి యేసును విశ్వసించే వాడిని క్రైస్తవుడు అని అంటారు.

మన ఆధునిక కాలంలో, తరచుగా " క్రైస్తవుడు" అనే వాడిని క్రైస్తవ మతంతో గుర్తించే వ్యక్తికి ఉపయోగిస్తున్నారు, కానీ నిజంగా యేసును వెంబడించటం లేదు. ఇది బైబిల్లోని “క్రైస్తవుడు” అనే పదానికి అర్థం కాదు.

  • బైబిల్లోని “క్రైస్తవుడు” అనే పదం ఎల్లప్పుడూ యేసును నిజంగా విశ్వసించే వ్యక్తిని సూచిస్తుంది కాబట్టి, క్రైస్తవుడిని “విశ్వాసి” అని కూడా పిలుస్తారు.

అనువాద సూచనలు:

  • ఈ పదాన్ని “క్రీస్తు-అనుచరుడు” లేదా “క్రీస్తు యొక్క అనుచరుడు” లేదా బహుశా “క్రీస్తు-వ్యక్తి” అని అనువదించవచ్చు.
  • ఈ పదం యొక్క అనువాదం శిష్యుడు లేదా అపొస్తలుడు కోసం ఉపయోగించే పదాల కంటే భిన్నంగా అనువదించబడిందని నిర్ధారించుకోండి.
  • ఈ పదాన్ని కొన్ని సమూహాలుకు కాకుండా యేసును విశ్వసించే ప్రతి ఒక్కరినీ సూచించే పదంతో అనువదించడానికి జాగ్రత్తగా చూసుకోండి.
  • మాతృ బాష లేదా జాతీయ భాషలోని బైబిలు అనువాదంలో ఈ పదం ఎలా అనువదించబడిందో కూడా పరిశీలించండి. (చూడండి: [తెలియని వాటిని ఎలా అనువదించాలి])

(ఇవి కూడా చూడండి: [అంతియొకయ], [క్రీస్తు] [సంఘం], [శిష్యులు], [నమ్మకం], [యేసు], [దేవుని కుమారుడు])

బైబిలు వివరణములు:

  • [1 కొరింతీయులు 6:7-8]
  • [1 పేతురు 4:16]
  • [అపోస్తలుల కార్యములు 11:26]
  • [అపోస్తలుల కార్యములు 26:28]

బైబిలు కధలు నుండి ఉదాహరణలు

  • [46:9] అంతియొకయలో యేసును విశ్వసించేవారిని మొదట “క్రైస్తవులు” అని పిలిచేవారు.
  • [47:14] పౌలు మరియు ఇతర క్రైస్తవ నాయకులు అనేక నగరాలకు వెళ్లి, ప్రజలకు యేసు గురించిన సువార్తను ప్రకటిస్తూ, బోధించారు.
  • [49:15] మీరు యేసులో మరియు ఆయన మీ కోసం ఏమి చేశారో విశ్వసిస్తే, మీరు క్రైస్తవుడు!
  • [49:16] మీరు క్రైస్తవులైతే, యేసు చేసిన దాని వల్ల దేవుడు మీ పాపాలను క్షమించాడు.
  • [49:17] మీరు __క్రైస్తవుడు __ అయినప్పటికీ, మీరు ఇంకా పాపం చేయడానికి శోధించబడతారు.
  • [50:3] ఆయన పరలోకానికి తిరిగి వెళ్లేముందు, ఎప్పుడూ వినని ప్రజలకు సువార్తను ప్రకటించమని క్రైస్తవులకు చెప్పారు.
  • [50:11] యేసు తిరిగి వచ్చినప్పుడు, చనిపోయిన ప్రతి క్రైస్తవుడు మృతులలో నుండి లేచి ఆకాశంలో కలుస్తారు.

పద వివరణ:

స్ట్రాంగ్స్: జి55460