te_tw/bible/kt/pentecost.md

2.6 KiB

పెంతెకోస్తు, వారముల పండుగ

వాస్తవాలు:

వారముల పండుగ” పస్కా పండుగ తరువాత యాభై రోజులకు జరిగే యూదుల పండుగ. ఇది తరువాత కాలములో “పెంతెకోస్తు” అని సూచించబడింది.

  • వారముల పండుగ ప్రధమ ఫలాల పండుగ తరువాత ఏడు వారాలు (యాభై రోజులు). కొత్త నిబంధన కాలంలో, ఈ పండుగ "పెంతెకొస్తు" అని పిలువబడింది. దాని అర్థంలో భాగంగా "యాభై" ఉంది.
  • • ధాన్యం కోత ప్రారంభాన్ని వేడుక చేసుకోడానికి వారముల పండుగ జరిగింది. ఇది దేవుడు మోషేకు ఇచ్చిన రాతి పలకలపై ఇశ్రాయేలీయులకు మొదట ధర్మశాస్త్రాన్ని ఇచ్చినదానిని కూడా జ్ఞాపకం ఉంచుకోవలసిన సమయం.
  • • కొత్త నిబంధనలో, పెంతెకోస్తు దినం ప్రత్యేకించి ప్రాముఖ్యమైనది ఎందుకంటే యేసు విశ్వాసులు కొత్త విధానంలో పరిశుద్ధాత్మను పొందిన సమయం.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదాలను కూడా చూడండి: పండుగ, ప్రథమ ఫలములు, కోత, పరిశుద్ధాత్ముడు, లేవనెత్తడం)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H2282, H7620, G4005