te_tw/bible/other/raise.md

10 KiB
Raw Permalink Blame History

లేవనెత్తు, లేచు, లేవనెత్తు, పైకి లేచు, అసమ్మతి లేవనెత్తు

నిర్వచనము:

లేవనెత్తు, పైకి లేవనెత్తు

సాధారణంగా, “లేవనెత్తు" అనే పదానికి “పైకి లేవనెత్తడం" లేదా "ఉన్నతంగా చేయడం” అని అర్థం.

  • “పైకి లేవనెత్తడం" పదానికి కొన్నిసార్లు ఏదైనా ఉనికిలోకి రావడానికి లేదా కనిపించడానికి కారణం అని అర్థం. ఏదైనా పని చేయడానికి ఒకరిని నియమించడం అని కూడా దీని అర్థం.
  • కొన్నిసార్లు “పైకి లేవనెత్తడం" అంటే “పునరుద్ధరణ” లేదా “పునర్నిర్మించడం” అని అర్థం.
  • "లేవ నెత్తు" అనే పదానికి "చనిపోయిన వారిలో నుండి లేపండి" అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. అంటే చనిపోయిన వ్యక్తిని మళ్లీ బ్రతికించేలా చేయడం.
  • కొన్నిసార్లు “పైకెత్తడం” అంటే ఎవరైనా లేదా దేనినైనా “ఉన్నతంగా చేయడం”.

లేచు, పైకి లేచు

"లేచు" లేదా "పైకి లేచు" అంటే "పైకి వెళ్లడం" లేదా "లేవడం" అని అర్థం. "పైకి లేచుట" "లేచుట" అనే పదాలు గత చర్యను వ్యక్తపరుస్తాయి.

  • ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్లడానికి లేచినప్పుడు, ఇది కొన్నిసార్లు "అతను లేచి వెళ్ళాడు" లేదా "అతను పైకి లేచి వెళ్ళాడు" అని వ్యక్తీకరించబడుతుంది.
  • ఏదైనా “పైకి లేస్లేతూ ఉంది" అంటే అది “జరుగుతుంది” లేదా “జరగడం ప్రారంభమవుతుంది” అని అర్థం.
  • తాను “చనిపోయిన వారిలో నుండి లేస్తానని” యేసు ప్రవచించాడు. యేసు చనిపోయిన మూడు రోజుల తర్వాత, దేవదూత, “ఆయన లేచాడు!” అన్నాడు.

అనువాదం సూచనలు:

  • “లెమ్ము” లేక “పైకి లెమ్ము” అనే ఈ పదమును “పైకి లేపు” లేక “పై స్థాయికి తీసుకొని వచ్చుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “పైకి లెమ్ము” అనే ఈ మాటను “బయటకి కనబడునట్లు కారణమగు” లేక “నియమించు” లేక “ఉనికిలోనికి తీసుకొని రమ్ము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “నీ శత్రువుల బలమును పైకి లేవనెత్తు” అనే ఈ మాటను “నీ శత్రువులు శక్తివంతులగునట్లు కారణమగు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “మరణమునుండి ఒకరిని లేపుట” అనే ఈ మాటను “ఒక వ్యక్తి మరణమునుండి జీవములోనికి వచ్చుటకు కారణమగు” లేక “ఒక వ్యక్తిని తిరిగి జీవించునట్లు చేయు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సందర్భానుసారముగా, “పైకి లేపుట” అనే ఈ మాటను “అనుగ్రహించు” లేక “నియమించు” లేక “కలిగియుండుటకు కారణమగు” లేక “నిర్మించు” లేక “పునర్మించు” లేక “తయారు చేయుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “లేచి, వెళ్ళెను” అనే ఈ మాటను “పైకి లేచి, బయటకు వెళ్ళెను” లేక “బయలుదేరెను” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సందర్భానుసారముగా, “లేచెను” అనే ఈ పదమును “ఆరంభించబడెను” లేక “ప్రారంభించబడెను” లేక “పైకి లేచెను” లేక “నిలువబడెను” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదాలను కూడా చూడండి: resurrection, appoint, exalt)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __21:14__మెస్సయ్యా మరణిస్తాడని మరియు దేవుడు ఆయనను మరణమునుండి లేవనెత్తునని కూడా ప్రవక్తలు ముందుగానే ప్రవచించిరి.
  • 41:5 “యేసు ఇక్కడ లేడు. ఆయన ముందుగా చెప్పినట్లుగానే, ఆయన మరణమునుండి లేచియున్నాడు!”
  • 43:7

“యేసు మరణించినప్పటికి, దేవుడు ఆయన మరణమునుండి లేపియున్నాడు . “నీవు పరిశుద్ధుని సమాధిలో కుళ్ళు పట్టనీయవు” అనే ప్రవచనము ఈ సంఘటన ద్వారా నెరవేర్చబడుతుంది. దేవుడు యేసును సజీవునిగా లేపియున్నాడను వాస్తవ సంఘటనకు మేమే సాక్షులం.”

”మీరు జీవాధిపతిని చంపియున్నారు, అయితే దేవుడు ఆయనను మరణమునుండి లేపియున్నాడు.”

  • 44:8 “మీ ముందు నిలిచియున్న ఈ మనుష్యుడు మెస్సయ్యాయైన యేసు శక్తి ద్వారా స్వస్థపరచబడియున్నాడు” అని పేతురు వారికి జవాబునిచ్చెను. మీరు యేసును సిలువవేసియున్నారు, అయితే దేవుడు ఆయనను తిరిగి సజీవునిగా లేపియున్నాడు!”
  • __48:4__సాతానుడు మెస్సయ్యాను చంపుతాడని దీని అర్థము, అయితే దేవుడు ఆయనను తిరిగి సజీవునిగా లేపుతాడు , మరియు మెస్సయ్యా సాతాను శక్తిని నలుగగొట్టుతాడు.
  • __49:2__ఆయన (యేసు) నీటి మీద నడిచాడు, తుఫానును నిమ్మలపరిచాడు, అనేకమంది రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, మరణమునుండి జీవమునకు అనేకమంది లేపాడు, మరియు ఐదు రొట్టెలు, రెండు చేపలను తృప్తిగా తినునంతగా 5,000 మందికి పంచిపెట్టాడు.
  • 49:12

యేసు దేవుని కుమారుడని నీవు తప్పక నమ్మాలి, నీకు బదులుగా సిలువలో ఆయన మరణించాడు, మరియు ఆయన సజీవునిగా ఉండుటకు దేవుడు తిరిగి ఆయనను లేపాడు. .

పదం సమాచారం:

  • Strongs: H2210, H2224, H5549, H5782, H5927, H5975, H6965, H6966, H6974, H7613, G03050, G03860, G03930, G04500, G10960, G13260, G14530, G15250, G18170, G18250, G18920, G19990, G48910