te_tw/bible/kt/resurrection.md

3.9 KiB
Raw Permalink Blame History

పునరుత్థానము

నిర్వచనము:

“పునరుత్థానము” అనే ఈ పదము చనిపోయిన తరువాత తిరిగి బ్రతికి వచ్చే ప్రక్రియను సూచిస్తున్నది.

  • ఎవరైనా పునరుత్థానముచేయుట/పునరుత్తరించుట/తెరిగి బ్రతికించుట అనగా ఆ వ్యక్తిని తిరిగి సజీవుడగునట్లు చేయుట అని అర్థము. కేవలము దేవుడు మాత్రమె దీనిని చేయగల సమర్థుడు.
  • “పునరుత్థానము” అనే ఈ మాట అనేకమార్లు యేసుక్రీస్తు చనిపోయిన తరువాత ఆయన తిరిగి సజీవుడైన విధమును సూచిస్తున్నది.
  • “నేనే పునరుత్థానమును, జీవమును” అని యేసు చెప్పిన మాటకు అర్థము ఏమనగా, ఆయనే పునరుత్థానము చెందుటకు ఆధారము/మూలము మరియు ప్రజలకు తిరిగి జీవమును ప్రసాదించుటకు ఆధారమునైయున్నాడు.

అనువాదం  సలహాలు:

  • ఒక వ్యక్తి యొక్క “పునరుత్థానము’ అనే ఈ మాటను అతను “తిరిగి జీవమును పొందియున్నాడు” లేక అతను “చనిపోయిన తరువాత తిరిగి జీవమును కలిగియుండుట” అని కూడా అనువాదం  చేయవచ్చును.
  • ఈ పదము యొక్క అక్షరార్థము ఏమనగా “పైకి లేపుట” లేక “(మరణమునుండి) పైకి లేపే ప్రక్రియ” అని అర్థము. ఈ పదమును అనువాదము చేయుటకు ఇవన్నియు ఇతర విధానములుగా పరిగణించవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: life, death, raise)

బైబిలు రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __21:14__మెస్సయ్యా మరణ పునరుత్థానముల ద్వారా, దేవుడు పాపులను రక్షించి, క్రొత్త నిబంధనను ఆరంభించుటకు తన ప్రణాళికను సంపూర్తి చేయును.
  • 37:5 నేనే పునరుత్థానము, జీవమునైయున్నాను” అని యేసు చెప్పెను. నాయందు విశ్వసించిన ప్రతియొక్కరు మరణించినను వారు జీవించుదురు.

పదం సమాచారం:

  • Strong's: G3860, G14540, G18150