te_tw/bible/other/death.md

8.2 KiB
Raw Permalink Blame History

చనిపోవడం, చనిపోయిన, ప్రమాదకరమైన, మరణం

నిర్వచనం:

ఈ పదాన్ని శారీరిక, ఆత్మ సంబంధమైన మరణాలు రెండింటి కోసం ఉపయోగిస్తారు. శారీరికంగా, ఒక మనిషి భౌతికశరీరం సజీవంగా లేని స్థితిని సూచిస్తున్నది. ఆత్మ సంబంధమైన మరణం అనేది వారి పాపం మూలంగా పరిశుద్ధ దేవుని నుండి వారు వేరై పోవడాన్ని సూచిస్తున్నది.

1. శారీరిక మరణం

  • "చనిపోవడం" అంటే ప్రాణం పోవడం. మరణం అనేది శారీరిక జీవానికి అంతం అని అర్థం.
  • "మరణం పాలు చేయడం" అంటే చంపడం, లేక ఎవరినైనా హత్యచెయ్యడం. ముఖ్యంగా ఒక రాజు లేక ఇతర అధిపతి ఎవరినైనా హతమార్చమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు.

2. శాశ్వతమైన మరణం

  • శాశ్వతమైన మరణం అంటే ఒక వ్యక్తి దేవుని నుండి వేరై పోవడం.
  • ఆదాము దేవునికి లోబడలేదు గనక ఆత్మ సంబంధంగా అతడు చనిపోయాడు. దేవునితో అతని సంబంధం తెగిపోయింది. అతడు సిగ్గు పాలై దేవుని నుండి తన స్థితి దాచి పెట్టుకోడానికి ప్రయత్నించాడు.
  • ఆదాము సంతతి అందరూ పాపులే. ఆత్మ సంబంధంగా మృతులే. మనం యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనలను మరలా ఆత్మ సంబంధంగా బ్రతికిస్తాడు.

అనువాదం సలహాలు:

  • ఈ పదం అనువదించడంలో, లక్ష్య భాషలో మరణాన్ని సూచించే సాధారణమైన, సహజమైన పదం ఉపయోగించడం మంచిది.
  • కొన్ని భాషల్లో "చనిపోవడం" అనే దానిని "నిర్జీవం" అని రాస్తారు. ""మృతం" పదం "జీవం పోయిన” లేక “జీవం కోల్పోయిన” లేక “బ్రతికి లేని" అని రాయబదవచ్చు.
  • అనేక భాషలు అలంకారికంగా మరణాన్ని వర్ణించడానికి “వెళ్లి పోయిన” మొదలైన మాటలు వాడతాయి. అయితే, బైబిల్లో సాధారణంగా ఉపయోగించే సూటియైన పదం వాడడం మంచిది.
  • బైబిల్లో, శారీరిక జీవ మరణాలను ఆత్మ సంబంధమైన జీవం, మరణంతో తరచుగా పోల్చారు. శారీరిక మరణం, ఆత్మ సంబంధమైన మరణం ఈ రెంటినీ సూచించే పదాన్ని వాడితే మంచిది. అనువాదం లో ఇది ప్రాముఖ్యం.
  • కొన్ని భాషల్లో ఇలాటి అర్థం రావడం అవసరం అయితే “ఆత్మ సంబంధమైన మరణం" అని ప్రత్యేకంగా వాడడం మంచిది. కొందరు అనువాదకులు ఆత్మ సంబంధమైన మరణం అనే దానికి భిన్నంగా చెప్పవలసి వస్తే "శారీరిక మరణం" అని రాస్తారు.
  • "మృతం" అనే మాట మనుషులు చనిపోయాక ఉండే స్థితిని చూపే మాములు విశేషణం. కొన్ని భాషలు దీనిని "మృతులు” అని గానీ లేక “మనుషులు చనిపోయాక" అని గానీ అనువదించడం చేస్తారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)
  • "మరణం విధించడం" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "చంపడం” లేక “హత్య” లేక “మరణశిక్ష అమలు" అని కూడా వాడవచ్చు.

(చూడండి: believe, faith, life)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __1:11__దేవుడు ఆదాముకు చెప్పాడు, అతడు తోటలో ఏ చెట్టు పండు అయినా తినవచ్చు, మంచిచెడు వివేచన ఇచ్చే చెట్టు ఫలం తప్ప. అతడు ఆ చెట్టు పండు తింటే అతడు చనిపోతాడు.
  • 2:11"తరువాత నీవు చనిపోతావు., నీ శరీరం తిరిగి మట్టికి చేరుకుంటుంది."
  • 7:10 తరువాత ఇస్సాకు చనిపోయాక, యాకోబు, ఏశావు పాతిపెట్టారు.
  • 37:5"యేసు ఇలా అన్నాడు, "నేనే పునరుత్థానం, జీవం. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు అతడు చనిపోవయినా జీవిస్తూ ఉంటారు. నన్ను విశ్వసించే ప్రతి ఒక్కరూ ఎన్నటికీ చనిపోవడం ఉండదు."
  • __40:8__తన మరణం ద్వారా మనుషులు దేవుని చెంతకు వచ్చే దారి ఏర్పరచాడు.
  • 43:7"యేసు చనిపోయినా, దేవుడు ఆయన్ను చావు నుండి లేపాడు."
  • __48:2__ఎదుకటే వారు పాపం చేసినప్పుడు, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాధుల పాలై చనిపోతారు.

పదం సమాచారం:

  • Strongs: H0006, H1478, H1826, H1934, H2491, H4191, H4192, H4193, H4194, H4463, H5038, H5315, H6297, H6757, H7496, H7523, H8045, H8546, H8552, G03360, G03370, G05200, G05990, G06150, G06220, G16340, G19350, G20790, G22530, G22860, G22870, G22880, G22890, G23480, G28370, G29660, G34980, G34990, G35000, G44300, G48800, G48810, G50530, G50540