7.9 KiB
7.9 KiB
జీవం, జీవించు, జీవించుచున్న, సజీవమైన
నిర్వచనం:
"జీవం" పదం భౌతికంగా చనిపోయి ఉండడానికి వ్యతిరేకంగా భౌతికంగా సజీవంగా ఉండడాన్ని సూచిస్తుంది.
1 శారీరక (భౌతిక) జీవం
- ఒక "జీవం" పదం "ఒక జీవితం కాపాడబడింది" లో ఉన్నట్టుగా ఒక వ్యక్తిని కూడా సూచిస్తుంది.
- కొన్నిసార్లు “జీవం” పదం “అతని జీవితం ఆనందభరితంగా ఉంది” లో ఉన్నట్టుగా జీవిస్తున్న అనుభవాన్ని సూచిస్తుంది.
- “అతని జీవిత అంతం” అనే వాక్యంలో ఉన్నట్టుగా ఇది ఒక వ్యక్తి జీవిత కాలపరిమితిని కూడా సూచిస్తుంది.
- ”జీవించడం” పదం “మా అమ్మ ఇంకా జీవించే ఉంది” లో ఉన్నట్టుగా శారీరికంగా సజీవంగా ఉండడాన్ని సూచిస్తుంది. “వారు పట్టణంలో నివసిస్తున్నారు”లో ఉన్నట్టుగా ఒక చోట నివసిస్తున్నారు అని సూచిస్తుంది.
- బైబిలులో “జీవం” అనే అంశం “మరణం” అంశంతో తరుచుగా విభేదిస్తుంది.
2 శాశ్వత జీవం
- ఒక వ్యక్తి యేసు నందు విశ్వాసముంచినప్పుడు శాశ్వత జీవాన్ని కలిగియుంటాడు, దేవుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివసించడం ద్వారా పరివర్తన చెందిన జీవితాన్ని ఇస్తాడు.
- శాశ్వత జీవానికి వ్యతిరేక పదం శాశ్వత మరణం, అంటే దేవుని నుండి వేరైపోవడం, శాశ్వత శిక్షను అనుభవించడం.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి, “జీవం” పదం “ఉనికి” లేదా “వ్యక్తి” లేదా “ప్రాణం" లేదా జీవి" లేదా "అనుభవం" అని అనువదించబడవచ్చు.
- ”జీవించడం” పదం “నివసించడం” లేదా లేక “ఉండడం” లేక “ఉనికిలో ఉండడం” అని అనువదించబడవచ్చు.
- “అతని జీవిత అంతం” అనే వ్యక్తీకరణ "అతడు జీవించడం నిలిపివేసినపుడు” అని అనువదించబడవచ్చు.
- ”వారి జీవితాలు విడిచి పెట్టారు" అనే వ్యక్తీకరణ “జీవించడానికి వారిని అనుమతించారు” లేదా "వారిని చంపలేదు" అని అనువదించబడవచ్చు.
- ”వారు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు” అనే వాక్యం “వారు తమని తాము ప్రమాదంలో ఉంచుకొన్నారు” లేదా “తమను చంపివెయ్యగల ఒక కార్యాన్ని వారు చేసారు” అని అనువదించబడవచ్చు.
- శాశ్వత జీవం గురించి బైబిలు మాట్లాడుతున్నప్పుడు, “జీవం” పదం ఈ క్రింది విధాలుగా అనువదించబడవచ్చు: “శాశ్వత జీవం” లేదా "దేవుడు మన ఆత్మలలో మనలను సజీవంగా చేస్తున్నాడు" లేదా "దేవుని ఆత్మ చేత నూతన జీవితం" లేదా "మన అంతరంగంలో సజీవం చెయ్యబడడం" అని అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి, “జీవాన్ని ఇవ్వడం” అనే వాక్యం “జీవించేలా చెయ్యడం" లేదా "శాశ్వత జీవం ఇవ్వడం" లేదా "శాశ్వతంగా జీవించేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
(చూడండి:death, everlasting)
బైబిలు రెఫరెన్సులు:
- 2 Peter 1:3
- Acts 10:42
- Genesis 2:7
- Genesis 7:22
- Hebrews 10:20
- Jeremiah 44:2
- John 1:4
- Judges 2:18
- Luke 12:23
- Matthew 7:14
బైబిలు కథలనుండి ఉదాహరణలు:
- __1:10__కనుక దేవుడు నేల మట్టిని తీసుకొని మానవుణ్ణి చేసాడు, అతనిలో జీవాన్ని ఊదాడు.
- __3:1__చాలా కాలం తరువాత లోకంలో అనేకమంది ప్రజలు జీవిస్తూ వచ్చారు.
- __8:13__యోసేపు సోదరులు తమ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, యోసేపు ఇంకా సజీవంగా ఉన్నాడని తమ తండ్రితో చెప్పారు. అతడు మిక్కిలి సంతోషించాడు.
- 17:9
అయితే అతని (దావీదు)జీవితం అంతంలో దేవుని యెదుట భయంకర పాపం చేసాడు.
- __27:1__ఒక రోజు యూదా ధర్మశాస్త్ర ప్రవీణుడు ఆయనను శోధించాలని యేసునొద్దకు వచ్చాడు., “బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.
- 35:5 ”పునరుద్దానమునూ, జీవమునూ నేనే” అని యేసు జవాబిచ్చాడు.
- 44:5 “యేసును చంపమని రోమా అధిపతికి మీరే చెప్పారు. జీవాధిపతిని మీరే చంపారు, అయితే దేవుడు ఆయనను మృతులలోనుండి లేపాడు.
పదం సమాచారం:
- Strong’s: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G01980, G02220, G02270, G08060, G05900