te_tw/bible/kt/eternity.md

8.4 KiB
Raw Permalink Blame History

నిత్యత్వం, శాశ్వతమైన, నిత్యమైన, శాశ్వతంగా

నిర్వచనం:

"శాశ్వతమైన” మరియు “శాశ్వత" అనే పదాలకు ఒకే విధమైన అర్థాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ ఉనికి కలిగియుండేదానినీ లేదా శాశ్వతకాలం నిలిచి ఉండేదానినీ సూచిస్తుంది.

  • "నిత్యత్వం" అంటే ఆరంభం లేదా అంతం లేని స్థితిని సూచిస్తున్నది. అంతం కాని జీవితాన్ని కూడా ఇది సూచిస్తుంది.
  • భూమిమీద ఈ ప్రస్తుత జీవితం తరువాత, మానవులు నిత్యత్వం పరలోకంలో దేవునితో గానీ లేదా దేవుడు లేకుండా నరకంలో గానీ గడుపుతారు.
  • "నిత్య జీవం” మరియు “శాశ్వత జీవం" అనే పదాలు కొత్త నిబంధనలో దేవునితో శాశ్వతకాలం పరలోకంలో శాశ్వతంగా జీవించడానికి ఉపయోగిస్తారు.
  • "శాశ్వతం" పదం అంతం కాని సమయాన్ని సూచిస్తుంది.
  • "శాశ్వత కాలం" పదానికి కాలం ఎప్పటికీ అంతం కాదు అనే భావన ఉంది, నిత్యత్వం లేక నిత్య జీవం ఆ విధంగా ఉంటుందని వ్యక్త పరుస్తుంది. ఎప్పుడూ సంభవించే దానిని లేదా ఉనికి కలిగియుండే దానిని నొక్కి చెపుతుంది. అంతం కాని సమయాన్ని సూచిస్తుంది.
  • దావీదు సింహాసనం "శాశ్వత కాలం" నిలుస్తుందని దేవుడు చెప్పాడు, దావీదు సంతానం, యేసు రాజుగా శాశ్వత కాలం పరిపాలన చేస్తాడనే వాస్తవాన్ని ఇది సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • "నిత్యత్వం" లేదా "శాశ్వతం" పదాలు "అంతం లేని" లేదా "ఎప్పటికీ ఆగిపోని" లేదా "ఎప్పుడూ కొనసాగుతున్న" అని మరొక విధాలుగా అనువదించబడవచ్చు.
  • "నిత్య జీవం,” “శాశ్వత జీవం" అనే పదాలు "అంతం కాని జీవితం" లేదా "ఆగిపోకుండా కొనసాగే జీవితం" లేదా "శాశ్వత కాలం జీవించడానికి మన శరీరాలను లేవనెత్తడం" అని కూడా అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, "నిత్యత్వం" పదం "కాలానికి వెలుపల ఉనికి కలిగి ఉండడం" లేదా "అంతం లేని జీవితం" లేదా పరలోకంలో జీవితం"అని వివిధ పద్ధతులలో అనువదించబడవచ్చు.
  • స్థానిక లేదా జాతీయ భాషలో బైబిలు అనువాదంలో ఈ పదం ఏవిధంగా అనువదించబడిండో పరిశీలించండి. (చూడండి: [తెలియని వాటిని అనువదించడం ఎలా])
  • "శాశ్వతకాలం" పదం "ఎల్లప్పుడూ" లేదా "ఎప్పటికీ ఆగిపోని" అని కూడా అనువదించబడవచ్చు.
  • "శాశ్వతం నిలుస్తుంది" పదబంధం "ఎల్లప్పుడూ ఉంటుంది" లేదా "ఎప్పటికీ ఆగిపోదు" లేదా "ఎల్లప్పుడూ కొనసాగుతుంది" అని అనువదించబడవచ్చు.
  • "శాశ్వతకాలం" అని నొక్కి చెప్పే పదం "ఎప్పుడూ, ఎల్లప్పుడూ" లేదా "ఎప్పటికీ ఆగిపోకుండా" "ఎప్పటికీ, ఎన్నడూ ఆగిపోని" అని అనువదించబడవచ్చు.
  • దావీదు సింహాసనం శాశ్వతకాలం ఉంటుంది అనే వాక్యం "దావీదు సంతానం శాశ్వత కాలం పాలిస్తారు" లేదా "దావీదు సంతానం ఎల్లపుడూ పాలన చేస్తుంటారు" అని అనువదించబడవచ్చు.

(చూడండి:David, reign, life)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • [27:01] ఒక రోజు, యూదుల ధర్మశాస్త్రంలో పండితుడు యేసును పరీక్షిస్తూ, అన్నాడు, బోధకుడా నిత్యజీవం వారసత్వంగా పొందడానికి నేనేమి చెయ్యాలి అని ఆయనను అడిగాడు.
  • [28:01] ఒక రోజు ఒక ధనవంతుడైన యవనస్థుడు యేసు దగ్గరికు వచ్చి, "మంచి బోధకుడా నేను నిత్య జీవం పొందాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. యేసు, "మంచిదానిని గురించి నీవు నన్ను అడుగుతున్నదేమిటి? మంచి వాడు ఒక్కడే, ఆయనే దేవుడు. అయితే నీకు నిత్య జీవం కావాలంటే, దేవుని ఆజ్ఞలకు లోబడు."
  • [28:10] యేసు ఇలా జవాబిచ్చాడు, "నా నిమిత్తము తమ గృహాలనూ, అన్నదమ్ములనూ, అక్కచెల్లెళ్ళనూ, తండ్రినీ, తల్లినీ లేదా ఆస్థినీ విడిచిపెట్టిన ప్రతిఒక్కరూ వంద రెట్లు అధికంగా పొందుతారు మరియు నిత్య జీవం కూడా పొందుతారు."

పదం సమాచారం:

  • Strongs: H3117, H4481, H5331, H5703, H5705, H5769, H5865, H5957, H6924, G01260, G01650, G01660, G13360