te_tw/bible/other/firstfruit.md

2.9 KiB
Raw Permalink Blame History

ప్రథమ ఫలాల పండగ

నిర్వచనం:

"ప్రథమ ఫలాల పండగ" అనేది ప్రతి కోత కాలంలోనూ మొదటి పండ్లు, కాయగూరలు, మొదటి ధాన్యం మొదలైన వాటిని సూచిస్తున్నది

  • ఇశ్రాయేలీయులు మొదటి ఫలాలను దేవునికి అర్పణ ఇస్తారు.
  • ఈ పదాన్ని బైబిల్లో అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. మొదట పుట్టిన కుమారుడు కుటుంబంలో ప్రథమ ఫలం. అంటే ఎందుకంటే అతడుకుటుంబంలో పుట్టిన మొదటి కుమారుడు, అతడు ఒక కుటుంబం పేరు, ప్రతిష్టలకు ప్రతినిధి.
  • యేసు మృతస్థితి నుండి లేచాడు కాబట్టి ఆయన్ను "ప్రథమ ఫలం” అన్నారు. అంటే ఆయనలో విశ్వాసం ఉంచిన వారు చనిపోయాక కొంతకాలానికి తిరిగి బ్రతుకుతారు.
  • యేసు విశ్వాసులు సృష్టి అంతటికీ "ప్రథమ ఫలాలు" అన్నారు. అంటే వారికి ప్రత్యేక ఆధిక్యత, స్థితి ఉంది. యేసు విమోచించిన వారిని అయన తన ప్రజలుగా పిలిచాడు.

అనువాదం సలహాలు:

  • అక్షరార్థంగా ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మొదటి భాగం (పంటలో)” లేక “కోతలో మొదటి భాగం."
  • వీలైతే, అలంకారికంగా వివిధ సందర్భాలకు వివిధ అర్థాలు ఇచ్చేలా అనువదించ వచ్చు.

ఆ విధంగా అక్షరార్థం అలంకారిక అర్థం కూడా చూపవచ్చు.

(చూడండి: firstborn)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1061, H6529, H7225, G05360