te_tw/bible/kt/dayofthelord.md

3.4 KiB

ప్రభువు దినం, యెహోవా దినం

వర్ణన:

పాత నిబంధన పదం "యెహోవా దినం " అనే దాన్ని దేవుడు ప్రజలను వారి పాపాలకు శిక్షించే నిర్దిష్టమైన సమయాలను సూచించడానికి ఉపయోగిస్తారు.

  • కొత్త నిబంధన పదం "ప్రభువు దినం " సాధారణంగా అంత్యకాలంలో యేసు ప్రభువు న్యాయాధిపతిగా తిరిగి వచ్చే సమయాన్ని సూచిస్తున్నది.
  • భవిషత్తులో అంతిమ తీర్పు, పునరుత్థానం సమయాన్ని ఇది కొన్ని సార్లు "అంత్య దినం"గా సూచిస్తుంది. ప్రభువు యేసు న్యాయాధిపతిగా పాపులను శిక్షించి తన శాశ్వత పరిపాలన నెలకొల్పుతాడు.
  • ఇందులో "రోజు" అనే పదం కొన్ని సార్లు అక్షరార్థంగా ఒక రోజు, లేక ఒక రోజు కన్నా సుదీర్ఘమైన"సమయం” లేక “సందర్భం" అని అర్థం ఇస్తాయి.
  • కొన్ని సార్లు ఇది శిక్షను సూచిస్తుంది. నమ్మనివారిపై " కుమ్మరించ బడే దేవుని ఆగ్రహం" అని అర్థం ఇస్తుంది.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఇతర పద్ధతులలో. "యెహోవా దినం " అనే దానిలో " యెహోవా సమయం” లేక “యెహోవా తన శత్రువులను శిక్షించే కాలం” లేక “యెహోవా ఆగ్రహ సమయం" అని అనువదించవచ్చు.
  • తర్జుమా చేసే ఇతర పద్ధతులు "ప్రభువు దినం" "ప్రభువు తీర్పు సమయం” లేక “మనుషులకు తీర్పు తీర్చడానికి యేసు ప్రభువు యేసు న్యాయాధిపతిగా తిరిగి వచ్చే కాలం."

(చూడండి: రోజు, తీర్పు దినం, ప్రభువు, పునరుత్థానం, యెహోవా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3068, H3117, G2250, G2962