te_tw/bible/other/biblicaltimeday.md

3.3 KiB
Raw Permalink Blame History

రోజు

నిర్వచనం:

“రోజు" పదం సాధారణంగా ఆకాశంలో వెలుగు మరియు చీకటి యొక్క ప్రత్యామ్నాయ కాలాల కోసం చక్రం (అంటే 24 గంటలు) పూర్తి చేయడానికి తీసుకునే సమయాన్ని సూచిస్తుంది. అయితే బైబిలులో, అదే పదాన్ని తక్కువ కాల వ్యవధిని (సూర్యోదయం మరియు సూర్యాస్తమయం మధ్య సమయం వంటివి) లేదా తరచుగా పేర్కొనబడని దీర్ఘ కాలాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు.

  • “రోజు” పదం కొన్నిసార్లు “రాత్రి” కి భిన్నంగా వినియోగించబడుతుంది. ఈ సందర్భాలలో, ఈ పదం ఆకాశం వెలుగుగా ఉన్నప్పుడు ఉన్న కాల సమయాన్ని సూచిస్తుంది..
  • ఈ పదం కాలంలో “ఈ రోజు” వంటి ఒక నిర్దిష్ట బిందువును కూడా సూచిస్తుంది.
  • కొన్నిసార్లు “రోజు” అనే పదం “యెహోవా దినం” లేదా “చివరి రోజులు” వంటి దీర్ఘ కాలాన్ని సూచించడానికి అలంకారికంగా వినియోగించబడుతుంది. ఈ అలంకారిక ఉపయోగాలను అనువదించడానికి కొన్ని భాషలు భిన్నమైన వ్యక్తీకరణను ఉపయోగిస్తాయి లేదా “రోజు” పదాన్ని అలంకారిక రహితంగా అనువదిస్తాయి.

అనువాదం సూచనలు:

  • వెలుగు ఉన్నప్పుడు రోజులో ఏదైనా భాగాన్ని సూచించడానికి మీ భాషలోని పదాన్ని ఉపయోగించి ఈ పదాన్ని అక్షరాలా “రోజు” లేదా “పగటిపూట” అని అనువదించడం మంచిది.
  • రోజు” పదం ఇతర అనువాదాలలో సందర్భాన్ని బట్టి “పగటిపూట,” “సమయం,” “కాలము” “సందర్భం” లేదా “సంఘటన” అని ఉండవచ్చు.

(చూడండి: time, judgment day, last day)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3117, H3118, H6242, G22500