6.1 KiB
పిల్లలు, బిడ్డ, సంతానం
నిర్వచనం:
"బిడ్డ" పదం ("పిల్లలు" బహువచనం) ఒక స్త్రీ పురుషుల సంతానాన్ని సూచిస్తుంది. ఈ పదం సాధారణంగా వయసులో చిన్నవారినీ, ఇంకా పూర్తిగా ఎదగని యువజనులనూ, సూచించడానికి తరచుగా ఉపయోగించబడింది. "సంతానం" పదం ప్రజలు లేదా జంతువుల జీవసంబంధమైన సంతతి వారికి సాధారణ సూచన.
· బైబిలులో, శిష్యులూ, వెంబడించే వారు కొన్నిసార్లు "పిల్లలు" అని పిలువబడ్డారు.
· "పిల్లలు"అనే పదం తరచుగా ఒక వ్యక్తి సంతానాన్ని సూచిస్తూ ఉపయోగించబడింది.
· బైబిలులో తరచుగా "సంతానం" అనే పదం "పిల్లలు" లేదా "సంతానం" అని ఒకే అర్థాన్ని కలిగియుంది.
· "విత్తనం" పదం కొన్నిసార్లు సంతానానికి చిత్ర రూపకంగా చూపించడానికి ఉపయోగించబడింది.
· "పిల్లలు" పదం ఏదైనా ఒకదానితో వర్గీకరిస్తున్నట్లుగా సూచించవచ్చు. దీనికి కొన్ని ఉదాహరణలు ఇలా ఉంటాయి:
o వెలుగు పిల్లలు.
o విధేయత పిల్లలు.
o అపవాది పిల్లలు.
· ఈ పదం సంఘాన్ని సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, కొన్నిసార్లు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రజలను "దేవుని పిల్లలు" అని కొత్త నిబంధన సూచిస్తుంది.
అనువాదం సూచనలు:
- "పిల్లలు"అనే పదం ఒక వ్యక్తి మునుమనవళ్ళు, లేదా ముని మునుమనవళ్ళు మొదలైన వారిని సూచిస్తున్నప్పుడు "సంతానం" అని అనువదించబడవచ్చు.
- సందర్భం ఆధారంగా "పిల్లలు" అనే పదాన్ని "లక్షణాలు కలిగియున్నవ్యక్తులు" లేదా "వారిలా ప్రవర్తించే వ్యక్తులు" అని అనువదించబడవచ్చు.
- సాధ్యమైనంత వరకు "దేవుని పిల్లలు" పదం అక్షరాలా అనువదించబడవచ్చు ఎందుకంటే దేవుడు మన పరలోకపు తండ్రి అనేది బైబిలులో ఉన్న ప్రాముఖ్యమైన అంశం. "దేవునికి చెందిన వ్యక్తులు" లేదా "దేవుని ఆత్మీయ పిల్లలు" అనేది సాధ్యమైన అనువాదంగా ఉంది.
- యేసు తన శిష్యులను "పిల్లలు,"అని పిలిచినప్పుడు ఇది "ప్రియమైన స్నేహితులు" లేదా "నా ప్రియమైన శిష్యులు" అని కూడా అనువదించబడవచ్చు.
- పౌలు, యోహాను యేసు నందు విశ్వాసులను "పిల్లలు" అని సూచించినప్పుడు ఇది "ప్రియమైన తోటి విశ్వాసులు" అని కూడా అనువదించబడవచ్చు.
- "వాగ్దాన పుత్రులు” అనే వాక్యం "దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందిన ప్రజలు" అని కూడా అనువదించబడవచ్చు.
(చూడండి:descendant, seed, promise, son, spirit, believe, beloved)
బైబిలు రిఫరెన్సులు:
- 1 యోహాను 2:28
- 3 యోహాను 1:4
- గలతీ 4:19
- ఆది 45:11
- యెహోషువా 8:34-35
- నేహేమ్యా 5:5
- అపో.కా 17:29
- నిర్గమ 13:11-13
- ఆది 24:7
- యెషయా 41:8-9
- యోబు 5:25
- లూకా 3:7
- మత్తయి 12:34
పదం సమాచారం:
- Strong’s: H1069, H1121, H1123, H1129, H1323, H1397, H1580, H2029, H2030, H2056, H2138, H2145, H2233, H2945, H3173, H3205, H3206, H3208, H3211, H3243, H3490, H4392, H5209, H5271, H5288, H5290, H5759, H5764, H5768, H5953, H6185, H6363, H6529, H6631, H7908, H7909, H7921, G07300, G08150, G10250, G10640, G10810, G10850, G14710, G34390, G35150, G35160, G38080, G38120, G38130, G38160, G50400, G50410, G50420, G50430, G50440, G52060, G52070, G53880