te_tw/bible/kt/promise.md

5.5 KiB
Raw Permalink Blame History

వాగ్ధానం, వాగ్ధానం చేయబడిన

నిర్వచనం:

వాగ్ధానం ఒక క్రియాపదంగా ఉపయోగించబడినప్పుడు, "వాగ్దానం" పదం ఒక వ్యక్తి తాను చెప్పిన దానిని నెరవేర్చడానికి తనను తాను నిర్భంచుకొనే విధానంలో తాను ఏదైనా చేస్తానని చెప్పే చర్యను సూచిస్తుంది. నామవాచకంగా ఉపయోగించినప్పుడు "వాగ్దానం" పదం ఒక వ్యక్తి తాను చెయ్యడానికి తనను తాను నిర్భందించుకొనే పనిని సూచిస్తుంది.

  • దేవుడు తన ప్రజలకు చేసిన అనేక వాగ్దానాలను బైబిలు నమోదు చేసింది.
  • వాగ్దానాలు నిబంధనలవలే క్రమబద్దమైన ఒప్పందాలలో ప్రాముఖ్యమైన భాగంగా ఉన్నాయి.

అనువాదం సూచనలు:

  • “వాగ్ధానం" పదం “సమర్పణ" లేదా “నిశ్చయత" లేదా "హామీ" అని అనువదించబడవచ్చు.
  • “ఏదైనా చేయడానికి వాగ్దానం చేయడం" పదబంధం “నీవు చేయబోయే పనిని తప్పకుండ చేస్తానని ఇతరులకు నిశ్చయత ఇవ్వడం" లేదా "ఏదైనా చెయ్యడానికి సమర్పించుకోవడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి:covenant, oath, vow)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 3:15 “జనులు చేసే చెడ్డ పనులను బట్టి మరియొకమారు నేను నేలను శపించనని లేక జనులు నాకు పిల్లలైనప్పటినుండి వారు పాపులైనప్పటికిని ప్రళయమును రప్పించుట ద్వారా లోకమును నాశనము చేయనని నేను వాగ్ధానము చేయుచున్నాను.” Â<>
  • __3:16__దేవుడు తన వాగ్ధానమునకు చిహ్నముగా మొట్ట మొదటిగా ఆయన ఇంద్రధనుస్సును చేశాడు. ఆకాశములో ఇంద్రధనుస్సు కనిపించే ప్రతీసారి  దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొంటాడు మరియు తన ప్రజలను జ్ఞాపకం చేసుకొంటాడు.
  • __4:8__దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు మరియు అతడు ఒక కుమారుని కలిగియుంటాడని మరియు ఆకాశంలోని విస్తారమైన నక్షత్రాలవలే ఉంటారని వాగ్దానం చేసాడు. అబ్రాహాము దేవుని వాగ్ధానమును నమ్మాడు.
  • 5:4”నీ భార్య శారాయి ఒక కుమారుని కనును, అతను వాగ్ధాన పుత్రుడు అనబడును.”
  • __8:15__దేవుడు అబ్రాహాముకిచ్చిన నిబంధన వాగ్ధానములు ఇస్సాకుకూ, యాకోబుకూ, యాకోబు పన్నెండు మంది కుమారులకూ, వారి కుటుంబములకూ అనుగ్రహించబడ్డాయి.
  • __17:14__దావీదు దేవునికి అపనమ్మకస్థుడుగా ఉన్నప్పటికీ, దేవుడు తన వాగ్ధానముల విషయములో ఇంకా నమ్మదగినవాడుగా ఉన్నాడు.
  • __50:1__లోక అంతమున యేసు తిరిగి వస్తాడని ఆయన వాగ్ధానము చేసాడు, ఆయన ఇంకా తిరిగి రాకపోయినప్పటికీ, ఆయన తన వాగ్ధానమును నెరవేర్చుతాడు.

పదం సమాచారం:

  • Strongs: H0559, H0562, H1696, H8569, G18430, G18600, G18610, G18620, G36700, G42790