te_tw/bible/kt/son.md

8.1 KiB
Raw Permalink Blame History

కుమారుడు

నిర్వచనము :

స్త్రీ పురుషులకు పుట్టిన మగ సంతానమును అతని జీవితకాలమంతా వారి “కుమారుడు” అని పిలువబడతాడు. ఇతడు ఆ పురుషుని కుమారుడనీ, ఆ స్త్రీ కుమారుడని కూడా పిలువబడతాడు. “దత్తపుత్రుడు” అనగా కుమారుని స్థానములో ఉండుటకు చట్టబద్ధంగా ఉంచబడిన మగబిడ్డ.

●        బైబిలులో "యొక్క కుమారుడు" అన్న పదం ఒకని ముందు తరం నుండి ఆ వ్యక్తి తండ్రి, తల్లి లేదా పితరులను గుర్తించడానికి  ఉపయోగిస్తారు. ఈ పదం వంశావళులలోనూ, ఇతర చోట్లా ఉపయోగించబడుతుంది.

●        “ఇశ్రాయేలు కుమారులు” అనగా ఇశ్రాయేలు  దేశాన్ని సూచిస్తుంది (ఆదికాండము ప్రకారంగా)

●        తండ్రి పేరును సూచించడానికి  "యొక్క కుమారుడు" పదం ఉపయోగించడం ఒకే పేరు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, 1 రాజులు గ్రంథం 4 అధ్యాయంలో "సాదోకు కుమారుడైన అజర్యా," నాతాను కుమారుడైన అజర్యా," 2 రాజులు గ్రంథం 15 అధ్యాయంలో అమజ్యా కుమారుడైన అజర్యా" లలో ముగ్గురు భిన్నమైన వ్యక్తులు.

●        “యొక్క కుమారుడు” అన్న పదాన్ని తదుపరి పరిచయం అయ్యే  వ్యక్తితో లేక భావనతో ఉపయోగించవచ్చు  ఆ అర్ధాన్ని  సందర్భానుసారంగా  నిర్ణయయించవచ్చు. అది అనుకూలంగా, 2 రాజులు 2:16 (సామర్ధవంతులైన కుమారులు) అని ఉండవచ్చు లేక ప్రతికూలంగా  2 సమూయేలు 7:10 (దుర్బుద్ధి గల కుమారులు )  అని ఉండవచ్చు.అది కూడా ఒక వ్యక్తి పేరును చెప్పకుండా ఒక గుంపుకి చెందినవారిని  సూచించడం (ఉదా: సెరూయా కుమారులారా).అని చెప్పడం. .

అనువాదం సలహాలు:

●        ఈ పదం ఉపయోగించబడిన అనేక సమయాల్లో, కుమారుడిని సూచించవలసిన భాషలో అక్షరార్థమైన పదం చేత అనువదించడం ఉత్తమం.

●        "దేవుని కుమారుడు" అనే పదం అనువదించేటప్పుడు, అనువదించవలసిన భాష యొక్క సాధారణ పదం అయినా “కుమారుడు” అని వాడాలి. .

●        కొన్నిసార్లు "కుమారులు" అన్న పదాన్ని  మగపిల్లలను మరియు  ఆడపిల్లలను ఇద్దరినీ సూచించేలా  "పిల్లలు" అన్న పదం చేత అనువదించవచ్చు. ఉదాహరణకు, "దేవుని కుమారులు" పదాని "దేవుని పిల్లలు" అని అనువదించవచ్చు, దీనిలో ఆడపిల్లలూ, స్త్రీలూ కలిసి ఉంటారు.

(చూడండిdescendant, ancestor, Son of God, sons of God)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

●  __4:8__దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, అతనికి ఒక కుమారుని మరల వాగ్దానం చేశాడు, ఆకాశాములో నక్షత్రములవలె లెక్కలేనంతమంది సంతానమును అనుగ్రహిస్తానని వాగ్ధానము చేశాడు.

● 4:9 “నీ స్వంత శరీరమునుండి కుమారుని నీకు ఇచ్చెదనని” దేవుడు చెప్పాడు.

●  __5:5__ఒక సంవత్సరమైన తరువాత, అబ్రాహాముకు 100 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు, శారాకు 90 సంవత్సరములు ఉన్నప్పుడు, శారా అబ్రాహాముకు కుమారుని కన్నది.

●  __5:8__వారు బలి అర్పించు స్థలముకు వచ్చినప్పుడు, అబ్రాహాముకు తన కుమారుడైన ఇస్సాకును కట్టి, బలిపీఠము మీద ఉంచాడు. అతడు తన కుమారుని బలి ఇవ్వబోయే సమయములో, “ఆగుము! బాలుని ఏమి చేయవద్దు! నువ్వు నాకు భయపడుదువని, నీ ఒక్కగానొక్క కుమారుని నాకిచ్చుటకు వెనుక తీయవని నేనిప్పుడు తెలుసుకొనియున్నాను” అని దేవుడు చెప్పాడు.

●  __9:7__ఆమె బిడ్డను చూసినప్పుడు, ఆమె తన స్వంత కుమారునిగా స్వీకరించెను.

●  __11:6__దేవుడు ఐగుప్తుల ప్రథమ సంతానమైన కుమారులు అందరినీ చంపాడు.

● __18:1__అనేక సంవత్సరములైన తరువాత, దావీదు మరణించాడు, తన కుమారుడు సొలొమోను పరిపాలించుటకు ఆరంభించాడు.

●  26:4“ఇతను యోసేపు కుమారుడు కాడా?” అని వారు చెప్పుకొనిరి.

పదం సమాచారం:

  • Strongs: H1060, H1121, H1123, H1248, H3173, H3206, H3211, H4497, H5209, H5220, G38160, G50430, G52070