te_tw/bible/other/seed.md

4.7 KiB
Raw Permalink Blame History

విత్తనము, వీర్యము

నిర్వచనము:

విత్తనము అనునది చెట్టులో ఒక భాగమైయుండును, అదేవిధమైన చెట్టును పుట్టించుటకు ఆ విత్తనమును భూమిలో నాటుదురు. దీనికి అనేకమైన అలంకారిక అర్థములు ఉన్నాయి.

  • పురుషునిలోని కణాలు మరియు స్త్రీలోని కణాలు చేరి స్త్రీ గర్భములో శిశువును పుట్టించుటను సూచించుటకు “విత్తనము” అనే ఈ పదము అలంకారముగా వాడబడింది. ఈ కణాల సంగ్రహమునే వీర్యము అని పిలుస్తారు.
  • దీనికి సంబంధించి, “విత్తనము (లేక బీజము)” అనే ఈ పదమును ఒక వ్యక్తి సంతానమును లేక వంశమును సూచించుటకు కూడా ఉపయోగించబడింది.
  • ఈ పదమునకు అనేకమార్లు బహుళత్వ అర్థము కలిగియుంటుంది, ఇది ఒక విత్తనము గింజకంటే ఎక్కువగా సూచిస్తుంది లేక ఒక సంతానముకంటే ఎక్కువ సంతానమును సూచిస్తుంది.
  • విత్తువాడు విత్తనముల గింజలను గూర్చి యేసు చెప్పిన ఉపమానములో యేసు ఆ విత్తనములను దేవుని వాక్యమునకు పోల్చియున్నాడు, ఇది మంచి ఆత్మీయ ఫలములను ఫలించునట్లు ప్రజల గుండెల్లో నాటబడుతుంది.
  • అపొస్తలుడైన పౌలు దేవుని వాక్యమును సూచించుటకు “విత్తనము” అనే పదమును ఉపయోగించును.

తర్జుమా సలహాలు;

  • అక్షరార్థమైన విత్తనము కొరకైతే అనువాద భాషలో రైతులు తమ పొలములో విత్తే దానికొరకు ఉపయోగించే “గింజ లేక గింజలు” అని ఉపయోగిస్తే చాలా మంచిది.
  • అక్షరార్థమైన పదమును దేవుని వాక్యమును అలంకారముగా సూచించే సందర్భాలలో ఉపయోగించుదురు.
  • అలంకారిక ఉపయోగము కొరకు, ఒకే కుటుంబమునకు సంబంధించిన ప్రజలను సూచించుటకు ఉపయోగించబడింది, బహుశః బీజము లేక గింజ అని ఉపయోగించుటకు బదులుగా “సంతానము” లేక “వారసులు” అని ఉపయోగిస్తే బాగుంటుంది. కొన్ని భాషలలో “పిల్లలు మరియు మనవండ్రు” అని అర్థమిచ్చే పదాలను ఉపయోగించవచ్చు.
  • స్త్రీ పురుషుల “బీజము” కొరకైతే, అనువాద భాషలో ఎలా ఏ విధముగా ప్రజలను నొప్పించని విధములో వ్యక్తపరుస్తారోనన్న విషయాని గమనించండి.

(చూడండి: సభ్యోక్తి)

(ఈ పదములను కూడా చూడండి:children, descendant)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H2232, H2233, H3610, H6507, G46150, G46870, G46900, G47010, G47030