te_tw/bible/other/royal.md

3.0 KiB

రాజరికం, రాజసత్వము

నిర్వచనము:

“రాజరికం” అనే ఈ పదము రాజుకు లేక రాణికి సంబంధించిన వస్తువులను మరియు ప్రజలను వివరించును.

  • “రాజరికం” అనే పిలువబడే వస్తువులకు ఉదాహరణగా ఇక్కడ ఇవ్వబడియున్నవి, అవేమనగా రాజు యొక్కవస్త్రాలు, రాజభవనము, సింహాసనము, మరియు కిరీటము.
  • రాజు లేక రాణి సాధారణముగా రాజరికపు భవనములో నివసించియుందురు.
  • రాజు విశేషమైన వస్త్రాలను ధరించియుండును, కొన్నిమార్లు ఆ వస్త్రాలను “రాజరికపు నిలువంగిలు” అని కూడా పిలుస్తారు. అనేకమార్లు రాజు నిలువంగిలు ఊదారంగును కలిగియుంటాయి, ఈ రంగును చాలా అరుదైన, ఎక్కువ వెలగల అద్దకము ద్వారా ఉత్పాదన చేస్తారు.
  • క్రొత్త నిబంధనలో యేసునందున్న విశ్వాసులందరిని “రాజులైన యాజకులు” అని కూడా పిలిచెదరు. ఈ మాటను తర్జుమా చేసే ఇతర విధానములలో “రాజైన దేవునిని సేవించు ప్రజలు” లేక “రాజైన దేవుని కొరకు పిలువబడిన యాజకులు” అని కూడా ఉపయోగించెదరు.
  • “రాజరికం” అనే ఈ మాటను కూడా “రాజఠీవియైన” లేక “రాజుకు సంబంధించిన” అని తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: రాజు, రాజభవనము, యాజకుడు, ఊదా రంగు, రాణి, నిలువంగి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H643, H1921, H1935, H4410, H4428, H4430, H4437, H4438, H4467, H4468, H7985, H8237, G933, G934, G937