te_tw/bible/other/queen.md

2.5 KiB

రాణి, రాణులు

నిర్వచనము:

ఒక దేశమును పాలించే పాలకురాలైన స్త్రీనిగాని లేదా రాజు భార్యనుగాని రాణి అని పిలిచెదరు.

  • ఎస్తేరు రాణి రాజైన ఆహాశ్వేరోషును వివాహమాడిన తరువాత ఆమె పారసీక సామ్రాజ్యమునకు రాణియాయెను.
  • రాణియైన యెజెబేలు రాజైన ఆహాబుకు దుష్ట భార్యయైయుండెను.
  • సెబా రాణి ప్రసిద్ధి చెందిన పాలకురాలు, ఈమె రాజైన సొలొమోనును దర్శించవచ్చెను.
  • “రాణి తల్లి” అనేటువంటి మాట పాలించే రాజు యొక్క అమ్మనుగాని లేక అవ్వనుగాని లేక ముందున్న రాజు భార్యనుగాని (విధవరాలునుగాని) పిలిచెదరు. రాణి తల్లి ఎక్కువ ప్రభావితము చేసియుంటుంది; ఉదాహరణకు, అతల్య - ఈమె జనులందరిని విగ్రహ ఆరాధికులనుగా చేసెను.

(ఈ పదములను కూడా చూడండి: ఆహాశ్వేరోషు, అతల్య, ఎస్తేరు, రాజు, పారసీక, పాలకుడు, సేబా)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1404, H1377, H4410, H4427, H4433, H4436, H4438, H4446, H7694, H8282, G938