te_tw/bible/other/palace.md

2.2 KiB

రాజ భవనం, రాజ భవనాలు

నిర్వచనము:

“రాజభవనం” అనే పదము రాజు మరియు తన కుటుంబ సభ్యులందరూ మరియు దాస దాసీయులందరూ నివసించే స్థలమును లేక భవనమును సూచించును.

  • మహా యాజకుడు కుడా రాజభవనములో నివసించేవాడని క్రొత్తనిబంధనలో పేర్కోనబడినది.
  • రాజభవనములు అందమైన కట్టడములతో మరియు వస్తువులతో అలంకరించబడియుంటాయి.
  • రాజ భవనములు మరియు అందులోనున్న పరికరాలు చెక్కతోగాని లేక రాతితో గాని నిర్మంచబడియుంటాయి, మరియు అనేకమార్లు చాలా విలువైన చెక్క, బంగారు లేక దంతములతో పొదిగించబడియుంటాయి.
  • ఇంకా వేరే ఇతర ప్రజలు కూడా రాజభవనములో నివసించి, అనేకమైన పనులను చెస్తూ ఉండిరి. వాస్తవానికి రాజభవనములో అనేకమైన గదులు మరియు ప్రాంగణములు ఉంటాయి.

(ఈ పదాలను కూడా చూడండి: ప్రాంగణము, మహా యాజకుడు, రాజు)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H643, H759, H1001, H1002, H1004, H1055, H1406, H1964, H1965, H2038, H2918, G833, G933, G4232