te_tw/bible/names/troas.md

2.2 KiB

త్రోయ

వాస్తవాలు:

త్రోయ పట్టణం ఒక ఓడ రేవు. ఇది ఆసియాలో ప్రాచీన రోమా పరగణా వాయవ్యంగా తీర ప్రాంతంలో ఉంది.

  • పౌలు వివిధ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ కనీసం మూడు సార్లు ఈ నగరానికి వచ్చాడు.
  • ఒక సందర్భంలో త్రోయలో పౌలు రాత్రివేళ ప్రసంగిస్తూ ఉంటే ఐతుకు అనే పేరుగల యువకుడు వింటూ నిద్రలో పది చనిపోయాడు. ఎందుకంటే అతడు తెరిచి ఉన్న కిటికీలో కూర్చున్నాడు. ఐతుకు మేడపై నుండి పడి చనిపోయాడు. దేవుని శక్తి ద్వారా పౌలు ఆ యువకుడికి జీవం పోశాడు.
  • పౌలు రోమ్ లో ఉన్నప్పుడు అతడు అతడు త్రోయలో విడిచి వచ్చిన తన పుస్తకం చుట్టలు తన అంగీ తెమ్మని తిమోతికి చెప్పాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆసియా, ప్రకటించు, పరగణా, లేపడం, రోమ్, పుస్తకం చుట్ట, తిమోతి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G5174