te_tw/bible/other/raise.md

10 KiB

లేవనెత్తు, లేవనెత్తును, లేవనెత్తెను, లెమ్ము, పైకి లెమ్ము, లేచుట, లేచెను

నిర్వచనము:

లేవనెత్తు, పైకి లేవనెత్తు సాధారణముగా “లేవనెత్తు” అనే పదమునకు “పైకి లేపు” లేక “పై స్థాయికి తీసుకొని వచ్చుట” అని అర్థము.

  • “పైకి లేవనెత్తు” అనే అలంకారిక మాటకు దేనినైనా ఉనికిలో ఉండునట్లుగా చేయుట లేక కనబడునట్లుగా చేయుట అని అర్థము. ఏదైనా పని చేయుటకు ఒకరిని నియమించుట అనే అర్థము కూడా ఈ పదమునకు కలదు.
  • కొన్నిమార్లు “పైకి లేవనెత్తు” అనే మాటకు “పునరుద్ధరణ” లేక “పునర్నించుట” అని అర్థము కలదు.
  • “లేవనెత్తు” అనే ఈ పదమునకు “మరణమునుండి లేవనెత్తుట” అనే ఈ మాటలో ఒక ప్రత్యెకమైన అర్థము కలదు. ఈ మాటకు చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవించువానిగా చేయుట అని అర్థము.
  • కొన్నిమార్లు “పైకి లేవనెత్తు” అనే ఈ మాటకు ఎవరినైనా లేక దేనినైనా “పొగడు” అని అర్థము.

“లెమ్ము, పైకి లెమ్ము “లెమ్ము” లేక “పైకి లెమ్ము” అనే ఈ మాటకు “పైకి వెళ్ళు” లేక “పైకి లేవడం” అని అర్థము. “లేచుట”, “లేపబడెను” మరియు “లేచెను” అనే ఈ మాటలు భూత కాలానికి చెందినవి.

  • ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళుటకు పైకి లేచినప్పుడు, ఈ మాటను కొన్నిమార్లు “లేచి, వెళ్ళాడు” లేక “అతను పైకి లేచి, బయటకి వెళ్ళాడు” అని చెబుతూ ఉంటారు.
  • ఏదైనా “లేచినట్లయితే”, దానికి అది “జరిగింది” లేక “జరుగుటకు ఆరంభించబడింది” అని అర్థము.
  • యేసు “మరణమునుండి లేచి వస్తానని” ఆయన ముందుగానే చెప్పాడు. యేసు మరణించిన మూడు రోజుల తరువాత, “ఆయన లేచియున్నాడు” అని దూత చెప్పెను!

తర్జుమా సలహాలు:

  • “లెమ్ము” లేక “పైకి లెమ్ము” అనే ఈ పదమును “పైకి లేపు” లేక “పై స్థాయికి తీసుకొని వచ్చుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “పైకి లెమ్ము” అనే ఈ మాటను “బయటకి కనబడునట్లు కారణమగు” లేక “నియమించు” లేక “ఉనికిలోనికి తీసుకొని రమ్ము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “నీ శత్రువుల బలమును పైకి లేవనెత్తు” అనే ఈ మాటను “నీ శత్రువులు శక్తివంతులగునట్లు కారణమగు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “మరణమునుండి ఒకరిని లేపుట” అనే ఈ మాటను “ఒక వ్యక్తి మరణమునుండి జీవములోనికి వచ్చుటకు కారణమగు” లేక “ఒక వ్యక్తిని తిరిగి జీవించునట్లు చేయు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సందర్భానుసారముగా, “పైకి లేపుట” అనే ఈ మాటను “అనుగ్రహించు” లేక “నియమించు” లేక “కలిగియుండుటకు కారణమగు” లేక “నిర్మించు” లేక “పునర్మించు” లేక “తయారు చేయుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “లేచి, వెళ్ళెను” అనే ఈ మాటను “పైకి లేచి, బయటకు వెళ్ళెను” లేక “బయలుదేరెను” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సందర్భానుసారముగా, “లేచెను” అనే ఈ పదమును “ఆరంభించబడెను” లేక “ప్రారంభించబడెను” లేక “పైకి లేచెను” లేక “నిలువబడెను” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదాలను కూడా చూడండి: పునరుత్థానము, నియమించు, పొగడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 21:14 మెస్సయ్యా మరణిస్తాడని మరియు దేవుడు ఆయనను మరణమునుండి లేవనెత్తునని కూడా ప్రవక్తలు ముందుగానే ప్రవచించిరి.
  • 41:05 “యేసు ఇక్కడ లేడు. ఆయన ముందుగా చెప్పినట్లుగానే, ఆయన మరణమునుండి లేచియున్నాడు!”
  • 43:07 “యేసు మరణించినప్పటికి, దేవుడు ఆయన మరణమునుండి లేపియున్నాడు . “నీవు పరిశుద్ధుని సమాధిలో కుళ్ళు పట్టనీయవు” అనే ప్రవచనము ఈ సంఘటన ద్వారా నెరవేర్చబడుతుంది. దేవుడు యేసును సజీవునిగా లేపియున్నాడను వాస్తవ సంఘటనకు మేమే సాక్షులం.”
  • 44:05 ”మీరు జీవాధిపతిని చంపియున్నారు, అయితే దేవుడు ఆయనను మరణమునుండి లేపియున్నాడు.”
  • 44:08 “మీ ముందు నిలిచియున్న ఈ మనుష్యుడు మెస్సయ్యాయైన యేసు శక్తి ద్వారా స్వస్థపరచబడియున్నాడు” అని పేతురు వారికి జవాబునిచ్చెను. మీరు యేసును సిలువవేసియున్నారు, అయితే దేవుడు ఆయనను తిరిగి సజీవునిగా లేపియున్నాడు!”
  • 48:04 సాతానుడు మెస్సయ్యాను చంపుతాడని దీని అర్థము, అయితే దేవుడు ఆయనను తిరిగి సజీవునిగా లేపుతాడు , మరియు మెస్సయ్యా సాతాను శక్తిని నలుగగొట్టుతాడు.
  • 49:02 ఆయన (యేసు) నీటి మీద నడిచాడు, తుఫానును నిమ్మలపరిచాడు, అనేకమంది రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, మరణమునుండి జీవమునకు అనేకమంది లేపాడు, మరియు ఐదు రొట్టెలు, రెండు చేపలను తృప్తిగా తినునంతగా 5,000 మందికి పంచిపెట్టాడు.
  • 49:12_ యేసు దేవుని కుమారుడని నీవు తప్పక నమ్మాలి, నీకు బదులుగా సిలువలో ఆయన మరణించాడు, మరియు ఆయన సజీవునిగా ఉండుటకు దేవుడు తిరిగి ఆయనను లేపాడు .

పదం సమాచారం:

  • Strong's: H2210, H2224, H5549, H5782, H5927, H5975, H6209, H6965, H6966, H6974, H7613, H7721, G305, G386, G393, G450, G1096, G1326, G1453, G1525, G1817, G1825, G1892, G1999, G4891