3.9 KiB
3.9 KiB
పునరుత్థానము
నిర్వచనము:
“పునరుత్థానము” అనే ఈ పదము చనిపోయిన తరువాత తిరిగి బ్రతికి వచ్చే క్రియను సూచించును.
- ఎవరైనా పునరుత్థానము చెందుట అనగా ఆ వ్యక్తిని తిరిగి సజీవుడగునట్లు చేయుట అని అర్థము. కేవలము దేవుడు మాత్రమె దీనిని చేయగల సమర్థుడు.
- “పునరుత్థానము” అనే ఈ మాట అనేకమార్లు యేసుక్రీస్తు చనిపోయిన తరువాత ఆయన తిరిగి సజీవుడైన విధమును గూర్చి తెలియజేయును.
- “నేనే జీవమును మరియు పునరుత్థానమును” అని యేసు చెప్పిన మాటకు అర్థము ఏమనగా, ఆయనే పునరుత్థానము చెందుటకు ఆధారము మరియు ప్రజలకు తిరిగి జీవమును ప్రసాదించుటకు ఆధారమునైయున్నాడు.
తర్జుమా సలహాలు:
- ఒక వ్యక్తి “పునరుత్థానము’ అనే ఈ మాటను అతను “తిరిగి జీవమును పొందియున్నాడు” లేక అతను “చనిపోయిన తరువాత తిరిగి జీవమును కలిగియుండుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- ఈ వాక్యము యొక్క అక్షరార్థము ఏమనగా “పైకి లేపుట” లేక “(మరణమునుండి) పైకి లేపే క్రియ” అని అర్థము. ఈ పదమును అనువాదము చేయుటకు ఇవన్నియు ఇతర విధానములుగా పరిగణించవచ్చును.
(ఈ పదములను కూడా చూడండి: జీవము, మరణము, లేపుట)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 కొరింతి.15:12-14
- 1 పేతురు.03:21-22
- హెబ్రీ.11:35-38
- యోహాను.05:28-29
- లూకా.20:27-28
- లూకా.20:34-36
- మత్తయి.22:23-24
- మత్తయి.22:29-30
- ఫిలిప్పీ.03:8-11
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 21:14 మెస్సయ్యా మరణ పునరుత్థానముల ద్వారా, దేవుడు పాపులను రక్షించి, క్రొత్త నిబంధనను ఆరంభించుటకు తన ప్రణాళికను సంపూర్తి చేయును.
- 37:05 “నేను జీవమును మరియు పునరుత్థానమునైయున్నాను” అని యేసు చెప్పెను. నాయందు విశ్వసించిన ప్రతియొక్కరు మరణించినను వారు జీవించుదురు.
పదం సమాచారం:
- Strong's: G386, G1454, G1815