te_tw/bible/other/scroll.md

2.6 KiB

చుట్ట, చుట్టలు

నిర్వచనము:

పురాతన కాలములో చుట్ట అనుదానిని చర్మముతోగాని లేక ప్యాపిరస్ అనే వాటిని పొడువుగా చేసికొని, వాటి మీద వ్రాసుకొని, వాటిని చుట్టగా చుట్టుకొని పుస్తకముగా వాడుకొనేవారు.

  • చుట్ట మీద వ్రాసిన తరువాత, దానిలో ఉన్నదానిని చదువుకొనిన తరువాత, ప్రజలు దానికి ఇరువైపుల కట్టెలను కట్టి ఉపయోగించుట ద్వారా చుట్టేవారు.
  • చుట్టలను లేఖనాలకొరకు మరియు న్యాయ సంబంధమైన పత్రాలకొరకు ఉపయోగించేవారు.
  • కొన్నిమార్లు ఒక రాయభారి ద్వారా అందించబడే చుట్టలకు మైనము ద్వారా ముద్ర వేసేవారు. చుట్టను తీసుకొనేటప్పుడు ఆ చుట్ట మీద మైనము ఇంకా ఉన్నట్లయితే, ఆ చుట్టను ఎవరూ తెరవలేదని లేక దాని మీద ఇతర వేరే సమాచారము వ్రాయలేదని మరియు దాని ముద్ర ఇంకను ఉందని పొందుకొనే వ్యక్తి తెలుసుకుంటాడు.
  • హెబ్రీ లేఖనములను కలిగియున్న చుట్టలను తెరచి సమాజ మందిరములలో గట్టిగా చదివేవారు.

(ఈ పదములను కూడా చూడండి: ముద్ర, సమాజ మందిరము, దేవుని వాక్యము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H4039, H4040, H5612, G974, G975