te_tw/bible/kt/synagogue.md

2.7 KiB

సమాజ మందిరము

నిర్వచనము:

సమాజ మందిరము అనునది దేవునిని ఆరాధించుటకు యూదులందరూ కలిసి ఒక దగ్గర కూడుకొనే భవనము.

  • పురాతన కాలములలో, సమాజ మందిర ఆరాదన కార్యక్రమాలలో ప్రార్థన సమయములు, వాక్య పఠనము, మరియు లేఖనములను గూర్చిన బోధ ఉండేది.
  • యూదులు తమ తమ స్వంత పట్టణములలో దేవునిని ఆరాధించుటకు మరియు ప్రార్థించుటకు అవకాశముండునట్లు సమాజ మందిరములను నిర్మించుటకు ఆరంభించిరి, ఎందుకంటే వారిలో అనేకులు యెరూషలేములోని దేవాలయమునకు ఎంతో దూరములో నివసించేవారు.
  • యేసు అనేకమార్లు సమాజ మందిరములో మాట్లాడియున్నాడు మరియు అనేకులను స్వస్థపరిచియున్నాడు. “సమాజ మందిరము” అనే మాట అక్కడ కూడుకునే ప్రజల గుంపును సూచించుటకు అలంకార ప్రాయముగా కూడా ఉపయోగించేవారు.

(ఈ పదములను కూడా చూడండి: స్వస్థపరచు, యెరూషలేము, యూదుడు, ప్రార్థించు, దేవాలయము, దేవుని వాక్యము, ఆరాధన)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H4150, G656, G752, G4864