te_tw/bible/kt/pray.md

6.4 KiB

ప్రార్థించు, ప్రార్థన

నిర్వచనం:

“ప్రార్థించు,” “ప్రార్థన” అనే పదాలు దేవునితో మాట్లాడడానిని సూచిస్తున్నాయి. ఈ పదాలు అబద్ధపు దేవునితో మాట్లాడుటకు ప్రయత్నించు ప్రజలను కూడా సూచించడానికి ఉపయోగించబడుతున్నాయి.

  • ప్రజలు మౌనముగా ఉండి ప్రార్థించవచ్చు, వారి ఆలోచనలతో దేవునితో మాట్లాడవచ్చు, లేదా వారు గట్టిగా అరిచి ప్రార్థించవచ్చు, వారి స్వరముతో దేవునితో మాట్లాడవచ్చును. దావీదు కీర్తనల గ్రంథములో తన ప్రార్థనలను వ్రాసికొనినట్లుగా కొన్నిమార్లు ప్రార్థనలను వ్రాస్తూ ఉంటారు.
  • ప్రార్థనలో కనికరము కోసం దేవునిని అడుగడం, సమస్యనుండి బయటకి రావడంలో సహాయం అడుగడం, నిర్ణయాలు చెయ్యడంలో జ్ఞానం కోసం వేడుకోవడం ఉంటాయి.
  • తరచుగా రోగులైన వారిని స్వస్థపరచమని ప్రజలు దేవునిని వేడుకుంటారు లేదా అవసరతలలో ఉన్నవారికి సహాయము చేయమని దేవునికి ప్రార్థిస్తారు.
  • ప్రజలు దేవునికి ప్రార్థన చేయునప్పుడు ఆయనను స్తుతిస్తారు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తారు.
  • ప్రార్థనలో దేవునితో మన పాపములను ఒప్పుకొనుటయు, మనలను క్షమించమని ఆయనను అడగుటయు ఉంటుంది.
  • దేవునితో మాట్లాడం అంటే మన ఆత్మ ఆయన ఆత్మతో సంభాషించుచున్నప్పుడు, మన భావోద్రేకాలను ఆయనతో పంచుకొంటున్నప్పుడు, ఆయన సన్నిధిని ఆనందించుచుండగా అది ఆయనతో "సహవాహం" అని పిలువబడుతుంది.
  • ఈ పదం "దేవునితో మాట్లాడడం" లేదా "దేవునితో సంభాషించడం" అని అనువదించబడవచ్చు. ఈ పదం అనువాదంలో మౌనంగా ఉండే ప్రార్థన అర్థం జతచెయ్యబడాలి.

(చూడండి: అబద్ధపు దేవుడు, క్షమించు, స్తుతించు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 06:05 ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థించెను, మరియు ఆమె కవల పిల్లలతో గర్భవతి కావడానికి దేవుడు అనుమతించాడు.
  • 13:12 అయితే మోషే వారికొరకు ప్రార్థించెను, మరియు దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను మరియు వారిని నాశనము చేయలేదు.
  • 19:08 ఆ తరువాత బయలు ప్రవక్తలు “బయలు దేవత, మా ప్రార్థనలు ఆలకించు” అని బయలుకు ప్రార్థించారు .
  • 21:07 యాజకులు కూడా ప్రజల కొరకు దేవుని ప్రార్థించిరి.
  • 38:11 మీరు శోధనలోనికి వెళ్ళకుండునట్లు ప్రార్థన చేయమని యేసు తన శిష్యులకు తెలియజేసెను.
  • 43:13 శిష్యులు అపొస్తలుల బోధను వింటూనే ఉన్నారు, అందరు కలసి సమయాన్ని గడిపారు, కలసి భోజనము చేశారు, మరియు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసికొనియున్నారు.
  • 49:18 ఇతర క్రైస్తవులతో కలిసి ఆరాధన చేయమని, ఆయన వాక్యమును ధ్యానము చేయమని, ప్రార్థించాలని దేవుడు మీతో చెపుతున్నాడు, మరియు ఆయన మీకు చేసిన కార్యములను ఇతరులతో పంచుకొనుమని చెపుతున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H559, H577, H1156, H2470, H3863, H3908, H4994, H6279, H6293, H6419, H6739, H7592, H7878, H7879, H7881, H8034, H8605, G154, G1162, G1189, G1783, G2065, G2171, G2172, G3870, G4335, G4336