te_tw/bible/other/heal.md

6.7 KiB

చికిత్స, స్వస్థమైన, స్వస్థపరచు, స్వస్థత పొందిన, స్వస్థపరచు, స్వస్థపరుచువాడు, ఆరోగ్యం, ఆరోగ్యకరం, అనారోగ్యకరం.

నిర్వచనం:

"చికిత్స," "స్వస్థపరచు" పదాలు రెండు రోగంతో ఉన్న వ్యక్తినీ, గాయపడిన వ్యక్తినీ లేదా వికలాంగుడిగా ఉన్న వ్యక్తినీ తిరిగి ఆరోగ్యవంతుడిగా చెయ్యడం.

  • "స్వస్థత పొందిన” లేదా "చికిత్స పొందిన" వ్యక్తి “బాగుఅయ్యాడు" లేదా "ఆరోగ్యవంతుడు” అయ్యాడు అని అర్థం.
  • స్వస్థత సహజంగా జరుగుతుంది ఎందుకంటే దేవుడు మన శరీరాలకు అనేక రకాల గాయాల నుండి రోగాలనుండి బాగుపడే సామర్థ్యం ఇచ్చాడు. సాధారణంగా ఇటువంటి స్వస్థత నెమ్మదిగా జరుగుతుంది.
  • అయితే, గుడ్డితనం లేదా పక్షవాతం, ఇంకా కుష్టువ్యాధివంటి కొన్ని తీవ్రమైన వ్యాధులున్న నిర్దిష్ట పరిస్థితులు వాటంతట అవే స్వస్థత పొందవు. మనుషులు వీటి నుండి స్వస్థత పొందినప్పుడు అది సహజంగా హటాత్తుగా సంభవించే అద్భుతం అవుతుంది. .
  • ఉదాహరణకు, యేసు అనేక మంది మనుషులను, గుడ్డి, కుంటి, ఇతర వ్యాధులు గల వారిని వెంటనే స్వస్థపడేలా చేశాడు.
  • అపొస్తలులు కూడా అద్భుతంగా ప్రజలను స్వస్థపరచారు. పేతురు అవిటి మనిషిని తక్షణమే లేచి నడిచేలా చేశాడు.

(చూడండి: అద్భుతం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 19:14 శత్రు రాజ్యం సర్వసైన్యాధ్యక్షుడు నయమాను చర్మ వ్యాధి నుండి అద్భుతంగా స్వస్థత కలిగింది. అతడు ఎలీషా గురించి విన్నాడు. అతడు ఎలీషాను స్వస్థత పరచాలని అడిగాడు.
  • 21:10 అతడు (యెషయా) మెస్సియా రోగులను స్వస్థపరుస్తాడని చెవిటి, మూగ, గుడ్డి వారిని, నడవలేని వారిని స్వస్థ పరుస్తాడని చెప్పాడు.
  • 26:06 యేసు చెప్పడం కొనసాగిస్తూ "ప్రవక్త ఎలీషా కాలంలో అనేక మంది ఇశ్రాయేలులో చర్మం రోగాలతో ఉన్నారు. అయితే ఎలీషా వారెవరినీ స్వస్థ పరచలేదు. అతడు కేవలం ఇశ్రాయేలీయుల శత్రువుల సేనానికి మాత్రమే కుష్టు వ్యాధిని స్వస్థ పరచాడు.
  • 26:08 వారు అనేక మంది చెవిటి, మూగ, గుడ్డి వారిని, నడవలేని వారిని యేసు స్వస్థపరుస్తాడని తీసుకురాగా, యేసు వారిని స్వస్థపరిచాడు .
  • 32:14 యేసుమూలంగా అనేక మంది స్వస్థత పొందారు అని ఆమె విన్నది. "నేను కేవలం యేసు వస్త్రాలు తాకితే చాలు, స్వస్థత పొందుతాను!" అని భావించింది.
  • 44:03 తక్షణమే, దేవుడు కుంటి మనిషిని స్వస్థపరిచాడు . అతడు నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించ సాగాడు.
  • 44:08 పేతురు ఇలా జవాబిచ్చాడు. "మీ ఎదుట నిలబడిన ఈ మనిషి యేసు మెస్సియా శక్తి వలన స్వస్థత పొందాడు."
  • 49:02 యేసు అనేక అద్భుతాలు చేసి అయన దేవుడు అని రుజువు పరచాడు. అయన నీటిపై నడిచాడు. తుఫానులను అణిచాడు. అనేకమంది రోగులను స్వస్థ పరిచాడు . దయ్యాలు వెళ్ళగొట్టాడు. మృతులను సజీవంగా లేపాడు. ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలను 5,000 మందికి ఆహారంగా ఇచ్చాడు.

పదం సమాచారం:

  • Strong's: H724, H1369, H1455, H2280, H2421, H2896, H3444, H3545, H4832, H4974, H7495, H7499, H7500, H7725, H7965, H8549, H8585, H8644, H622, G1295, G1743, G2322, G2323, G2386, G2390, G2392, G2511, G3647, G4982, G4991, G5198, G5199