te_tw/bible/other/seal.md

2.5 KiB

ముద్ర, ముద్రలు, ముద్రించబడినది, ముద్రించుట, విప్పబడని ముద్రము

నిర్వచనము:

ఒకదానిని ముద్రించుట అనగా ముద్రను విరగగొట్టకుండ తెరుచుటకు అసాధ్యమయ్యే విధముగా ఒకదానిని ముచ్చుట అని అర్థము.

  • అనేకమార్లు ముద్ర దేనికి లేక ఎవరికి సంబంధించినది అని చూపించుటకు వారిదే అయినటువంటి అలంకారముతో తయారుస్తారు.
  • కొన్ని పత్రాలను లేక ముఖ్యమైన పత్రాలను సంరక్షించుటకు కరిగిపోయిన మైనమును తీసుకొని ముద్రించేవారు. మైనము చల్లబడి గట్టిబడిన తరువాత, ఆ పత్రము లేక పత్రికను మైనపు ముద్రను పగలగొట్టకుండ తెరువలేరు.
  • యేసును సమాధి చేసి, దానిని రాతితో మూసిన తరువాత దానిని ఎవరు తెరవకుండు నిమిత్తము ఆ రాతి మీద ముద్రలను వేసియుండిరి.
  • మన రక్షణ ఎల్లప్పుడు భద్రముగా ఉంటుందని చూపించే “ముద్రగా” పరిశుద్దాత్ముని ముద్రకు అలంకారముగా పోల్చి పౌలు చెప్పియున్నారు.

(ఈ పదములను కూడా చూడండి: పరిశుద్ధాత్ముడు, సమాధి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2368, H2560, H2856, H2857, H2858, H5640, G2696, G4972, G4973