te_tw/bible/other/tomb.md

4.5 KiB

సమాధి, సమాధి తవ్వేవారు, సమాధులు, గోరీ, సమాధి స్థలం

నిర్వచనం:

పదాలు "సమాధి” “గోరీ" అంటే మనుషులు చనిపోయాక శరీరాన్ని పాతిపెట్టే స్థలం. "సమాధి స్థలం" అనే పదం దీన్ని సూచిస్తున్నది.

  • యూదులు కొన్ని సార్లు సహజమైన గుహలను సమాధులుగా ఉపయోగిస్తారు. కొన్ని సార్లు వారు కొండ వాలులో గుహలు తవ్వేవారు.
  • కొత్త నిబంధన కాలంలో , ఒక పెద్ద బరువైన రాయి సమాధిని మూయడానికి వాడేవారు.
  • లక్ష్య భాషలో సమాధి అంటే శరీరాన్ని పాతిపెట్టే నేలలో గుంట అనే అర్థమే వస్తే దీన్ని ఇతర పద్ధతుల్లో అనువదించడం మంచిది. "గుహ” లేక “కొండ తొలిచి."
  • " సమాధి" అనే పదాన్ని సాధారణంగా, అలంకారికంగా కూడా మృతస్థితికి, స్థలానికి కూడా తరచుగా ఉపయోగిస్తారు.

(చూడండి: పాతిపెట్టు, మరణం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 32:04 ఒక మనిషి ఆ ప్రాంతంలో సమాధుల్లో నివసించాడు.
  • 37:06 యేసు అతనితో, "మీరు లాజరును ఎక్కడ ఉంచారు?" వారు " సమాధిలో” వచ్చి చూడండి."
  • 37:07 సమాధి ఒక గుహ. ఒక రాయి డానికి అడ్డంగా ఉంది.
  • 40:09 తరువాత యేసు మెస్సియా అని విశ్వసించిన యోసేపు, నికోదేము అనే ఇద్దరు యూదు నాయకులు యేసుశరీరం కోసం పిలాతును అడిగారు. వారు ఆయన శరీరం గుడ్డలో చుట్టి రాతిని తొలిచిన సమాధి లో ఉంచారు. తరువాత వారు పెద్ద రాయి సమాధి ముఖానికి అడ్డంగా దొర్లించారు.
  • 41:04 అతడు ( దేవదూత) సమాధికి అడ్డంగా ఉన్న రాయి దొర్లించి దానిపై కూర్చున్నాడు. సమాధిని కాపలా కాసే సైనికులు భయంతో వణికి పోతూ చచ్చిన వారిలాగా నేలపై పడిపోయారు.
  • 41:05 స్త్రీలు సమాధి దగ్గరకు రాగా దేవదూత వారితో "భయపడకండి. యేసు ఇక్కడ లేడు. అయన తాను చెప్పినట్టే చనిపోయిన వారిలో నుండి లేచాడు! సమాధిలో చూడండి." స్త్రీలు సమాధి లోకి చూస్తే వారికి యేసు శరీరం కనబడ లేదు. ఆయన శరీరం అక్కడ లేదు!

పదం సమాచారం:

  • Strong's: H1164, H1430, H6900, H6913, H7585, H7845, G86, G2750, G3418, G3419, G5028