8.5 KiB
8.5 KiB
బోధించు, బోధ, బోధకుడు, ప్రకటించు, ప్రకటన
నిర్వచనం:
“బోధించు” అంటే ఒక ప్రజల గుంపుతో మాట్లాడడం, దేవుని గురించి వారికి బోధించడం, ఆయనకు విధేయులవ్వాలని వారిని ప్రేరేపించడం అని అర్థం. “ప్రకటించు” అంటే బహిరంగముగానూ, ధైర్యంగానూ ఒక దానిని చాటించడం లేదా వెల్లడించడం అని అర్థం.
- తరచుగా బోధ ఒక పెద్ద జనసమూహమునకు ఒక వ్యక్తి ద్వారా జరిగించబడుతుంది, ఇది సాధారణంగా చెప్పడం, రాయడం కాదు.
- “బోధ,” “ఉపదేశించడం” పదాలు ఒకేలా ఉంటాయి, అయితే ఖచ్చితంగా ఒకటి కాదు.
- “బోధ" పదం ప్రధానంగా ఆత్మీయ లేదా నైతిక సత్యాన్ని బహిరంగంగా ప్రకటించడం, ప్రేక్షకులు ఆ ప్రకటనకు స్పందించాలని ప్రేరేపించడం. "బోధ" హెచ్చరికను నొక్కి చెప్పే పదం, అంటే ప్రజలకు సమాచారాన్ని ఇవ్వడం లేదా దేనినైనా ఏవిధంగా చేయాలో బోధించడం.
- “బోధించడం" పదం " సాధారణముగా “సువార్త” అనే పదముతో ఉపయోగించబడింది.
- ఒక వ్యక్తి ఇతరులకు బోధించినది సాధారణంగా అతని “బోధనలుగా” కూడా పరిగణించబడుతాయి.
- తరచుగా బైబిలులో “ప్రకటించడం” అంటే దేవుడు ఆజ్ఞాపించినదానిని బహిరంగముగా చాటించడం అని అర్థం. లేదా దేవుని గురించీ, ఆయన గొప్పతనమును గురించీ ఇతరులకు తెలియచెప్పడం అని అర్థం.
- క్రొత్త నిబంధనలో అనేకమైన పట్టణాలలోనూ, ప్రాంతాలలోనూ, అనేక ప్రజలకు యేసుని గూర్చిన శుభవార్తను అపొస్తలులు ప్రకటించారు.
- “ప్రకటించు” పదం రాజుల ద్వారా చేయబడిన ఆదేశాల కోసమూ లేదా బహిరంగ విధానములో చెడును ఖండించడానికీ కూడా ఉపయోగించబడుతుంది.
- “ప్రకటించు” అనే పదమును తర్జుమా చేసే విధానములో “చాటించు” లేక “బహిరంగముగా ప్రసంగించు” పదం అనువాదంలో ఇతరవిధాలలో “చాటించడం" లేదా "బహిరంగముగా బోధించడం" లేదా "బహిరంగంగా వెల్లడించడం" పదాలు ఉండాలి.
- “ప్రకటన” పదం "చాటింపు" లేదా "బహిరంగ బోధ" అని అనువదించబడవచ్చు.
(చూడండి: శుభవార్త, యేసు, దేవుని రాజ్యము)
బైబిలు రిఫరెన్సులు:
- 2 తిమోతి 04:1-2
- అపొ.కా. 08:4-5
- అపొ.కా. 10:42-43
- అపొ.కా. 14:21-22
- అపొ.కా. 20:25
- లూకా 04:42
- మత్తయి 03:1-3
- మత్తయి 04:17
- మత్తయి 12:41
- మత్తయి 24:14
- అపొ.కా. 09:20-22
- అపొ.కా. 13:38-39
- యోనా 03:1-3
- లూకా 04:18-19
- మార్కు 01:14-15
- మత్తయి 10:26
బైబిలు కథలనుండి ఉదాహరణలు:
- 24:02 “దేవుని రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందండి” అని అతను (యోహాను) వారికి బోధించాడు.
- 30:01 అనేక గ్రామాలలో ప్రజలకు బోధించుటకునూ, ఉపదేశించుటకునూ యేసు తన శిష్యులను పంపాడు.
- 38:01 సుమారు ముప్పై సంవత్సరములైన తరువాత యేసు మొట్టమొదటిగా బహిరంగముగా బోధించుటకు మరియు ఉపదేశించుటకూ ఆరంభించాడు. ఈ పస్కా పండుగను యెరూషలేములో మీయందరితో ఆచరించుకోవాలని మరియు అక్కడే నేను మరణించబోవుచున్నాని ఆయన తన శిష్యులతో తన చిత్తాన్ని తెలియ పరచాడు.
- 45:06 అయితే ఇవన్ని జరుగుచున్నప్పటికిని, వారు వెళ్ళిన ప్రతిచోట యేసును గూర్చి వారు బోధిస్తూ వచ్చారు.
- 45:07 అతడు (ఫిలిప్పు) సమరయకు వెళ్లి యేసును గురించి బోధించాడు , అనేకులు రక్షణ పొందారు.
- 46:06 ఆ క్షణములోనే, సౌలు దమస్కులోని యూదులకు “యేసే దేవుని కుమారుడు” అని బోధించడం ఆరంభించాడు!
- 46:10 ఆ తరువాత అనేకమైన స్థలములలో యేసుని గూర్చిన శుభవార్త బోధించుటకు వారు వారిని పంపారు.
- 47:14 పౌలు మరియు ఇతర క్రైస్తవ నాయకులు అనేక పట్టణములకు ప్రయాణము చేసిరి, యేసుని గూర్చిన శుభవార్తను ప్రజలకు బోధిస్తూ మరియు ఉపదేశిస్తూ వెళ్ళారు.
- 50:02 యేసు ఈ భూమి మీద నివసించిన కాలంలో "నా శిష్యులు లోకంలోని ప్రతి స్థలంలోని ప్రజల వద్దకు వెళ్ళి దేవుని రాజ్యమునుగురించిన సువార్తను బోధిస్తారు. అప్పుడు అంతము వచ్చును" అని చెప్పాడు.
పదం సమాచారం:
- Strong’s:
- బోధించు: H1319, H7121, H7150, G1229, G2097, G2605, G2782, G2783, G2784, G2980, G4283
- ప్రకటించు: H1319, H1696, H1697, H2199, H3045, H3745, H4161, H5046, H5608, H6963, H7121, H7440, H8085, G518, G591, G1229, G1861, G2097, G2605, G2782, G2784, G2980, G3142, G4135