te_tw/bible/names/kidronvalley.md

2.5 KiB

కిద్రోను వాగు

వాస్తవాలు

కిద్రోను వాగు యెరూషలెం పట్టణానికి వెలుపల ఉన్న లోతైన వాగు. యెరుషలెం ఉత్తరం గోడకు ఒలీవల పర్వతానికి మధ్య ఈ వాగు ఉంది.

  • ఈ వాగు దాదాపు 1,000 మీటర్ల లోతు, 32 కిలోమీటర్లు పొడవు ఉంది.
  • దావీదు తన కుమారుడు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు ఒలీవల పర్వాతాలకు చేరడానికి కిద్రోను వాగు ద్వారా వెళ్ళాడు.
  • యోషియా, ఆసా అను యూదా రాజులు తప్పుడు దేవతల బలిపీఠాలను, వాటి ఉన్నత స్థలాలను ధ్వంసం చేసి, వాటిని కాల్చివేయాలని ఆజ్ఞాపించారు. వాటి బూడిద కిద్రోను వాగులో ముంచివేయబడ్డాయి,
  • హిజ్కియా రాజు పరిపాలనలో యాజకులు దేవాలయంలోని అపవిత్రమైన దానంతటిని తొలగించి కిద్రోను వాగులో పడద్రోసారు,
  • దుష్ట రాణి అతల్యాను ఆమె చేసిన దుర్మార్గపు కార్యాలను బట్టి ఈ వాగులో చంపివేశారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువాదం చెయ్యడం)

(చూడండి: అబ్షాలోము, ఆసా, అతల్యా, దావీదు, తప్పుడు దేవుడు, హిజ్కియా, ప్రధాన యాజకుడు, యూదా, ఒలీవల పర్వతం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5674, H6939, G2748, G5493